
స్వాల్ కార్పొరేషన్ నుంచి విశిష్ట సస్యరక్షణ ఉత్పత్తులు
హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తుల్లో పేరొందిన ‘స్వాల్ కార్పొరేషన్’ తాజాగా రైతుల కోసం ‘స్టార్‌తీన్ సూపర్’, ‘జెబా, ‘ఉక్సాల్’ అనే మూడు రకాల వ్యవసాయ ఉత్పాదనలను మార్కెట్‌లో ఆవిష్కరించింది. స్టార్‌తీన్ సూపర్.. రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నియంత్రిస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. గుళికల రూపంలో లభ్యమయ్యే జెబా.. నీటిని సమగ్రంగా సంగ్రహించి మొక్కకు అందిస్తుందని పేర్కొంది. ఫోలియర్ లిక్విడ్ ఫర్టిలైజర్ అయిన ఉక్సాల్‌ని పంట కాలంలో మూడు దఫాలుగా వాడి అధిక దిగుబడిని పొందొచ్చని వివరించింది.