ఎయిర్‌ఏషియా ఇండియా 20 శాతం డిస్కౌంట్‌ | AirAsia India 20% discount | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ఏషియా ఇండియా 20 శాతం డిస్కౌంట్‌

Published Sat, Feb 16 2019 12:38 AM | Last Updated on Sat, Feb 16 2019 5:29 AM

AirAsia India 20% discount - Sakshi

ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ, ఎయిరేషియా ఇండియా విమాన టికెట్లపై 20 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. తమ విమాన సర్వీసులపైనా, ఎయిర్‌ఏషియా నెట్‌వర్క్‌ విమాన సర్వీసుల్లోనూ ఈ ఆఫర్లు వర్తిస్తాయని ఎయిరేషియా ఇండియా తెలిపింది. ఈ ఆఫర్లకు సంబంధించిన బుకింగ్స్‌ నెల 18 నుంచి ప్రారంభమవుతాయని, ఈ నెల 25 వరకూ అందుబాటులో ఉంటాయని కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సునీల్‌ భాస్కరన్‌ తెలిపారు.

ఈ డిస్కౌంట్‌ టికెట్లతో ఈ నెల 25 నుంచి జూలై 31 వరకూ ప్రయాణించవచ్చని వివరించారు. ఎయిర్‌ఏషియా అంతర్జాతీయ రూట్లలో కూడా ఈ ఆఫర్లు వర్తిస్తాయని పేర్కొన్నారు. మన దేశానికి చెందిన టాటా గ్రూప్, మలేషియాకు చెందిన ఎయిరేషియా కలసి ఎయిర్‌ఏషియా ఇండియా జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీ 19 దేశీయ రూట్లలో, 20 ఎయిర్‌బస్‌ ఏ320లతో విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. కాగా,వెబ్‌సైట్‌ ద్వారాగానీ లేక యాప్‌ద్వారాకానీ టికెట్లను బుక్‌ చేసుకోవని ఎయిర్‌ఏషియా ఒక ప్రకటలో తెలిపింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement