టాక్సీలలో ఉచితంగా ఇంటర్నెట్! | Airtel ties up with Uber for free internet in cabs | Sakshi
Sakshi News home page

టాక్సీలలో ఉచితంగా ఇంటర్నెట్!

Published Fri, Aug 21 2015 3:40 PM | Last Updated on Fri, Aug 17 2018 6:21 PM

టాక్సీలలో ఉచితంగా ఇంటర్నెట్! - Sakshi

టాక్సీలలో ఉచితంగా ఇంటర్నెట్!

ఉబెర్ క్యాబ్లలో వెళ్తున్నారా, అయితే ఇక మీ స్మార్ట్ఫోన్లలో ఉచితంగా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఉబెర్ కంపెనీతో భారతి ఎయిర్టెల్ ఒక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల ఉచితంగా ఇంటర్నెట్ సేవలు పొందడంతో పాటు 'ఎయిర్టెల్ మనీ'ని ఉపయోగించి టాక్సీ చార్జీలు చెల్లించవచ్చు.

ఈ విషయాన్ని ఉబెర్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ముందుగా ముంబై మహానగరంలో ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఎయిర్టెల్ 4జి అందించే హైస్పీడ్ ఇంటర్నెట్ను ఉబెర్ క్యాబ్లలో పూర్తి ఉచితంగా అందుకోవచ్చని తెలిపారు. త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని ఉబెర్ క్యాబ్లలోనూ ఈ సదుపాయాన్ని కల్పిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement