ఫుడ్ ఈ–రిటైల్‌లో అమెజాన్ భారీ పెట్టుబడులు
దాదాపు రూ.3,300 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లకు ప్రతిపాదన: కేంద్రం
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం ‘అమెజాన్’... భారత్‌లోని ఫుడ్ ఈ–రిటైల్ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. అమెజాన్ దేశంలోని ఆహార ఉత్పత్తుల ఈ–రిటైల్ వ్యాపారంలో దాదాపు రూ.3,300 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు. గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్ వంటి కంపెనీలు కూడా ఆహార ఉత్పత్తుల రిటైల్ వ్యాపారం కోసం ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను సమర్పించాయని తెలియజేశారు. మెట్రో క్యాష్ అండ్ క్యారీ కూడా ఫుడ్ రిటైలింగ్‌పై ఆసక్తి కనబరుస్తోందని చెప్పారు.