దివాలా చట్టానికి సవరణ; లోక్‌సభలో బిల్లు | Amendment to bankruptcy law; Bill in Lok Sabha | Sakshi
Sakshi News home page

దివాలా చట్టానికి సవరణ; లోక్‌సభలో బిల్లు

Published Fri, Dec 29 2017 12:26 AM | Last Updated on Fri, Dec 29 2017 12:26 AM

Amendment to bankruptcy law; Bill in Lok Sabha - Sakshi

న్యూఢిల్లీ: ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్ట్సీ కోడ్‌ (సవరణ) బిల్లు 2017ను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దివాలా ప్రొసీడింగ్స్‌ ద్వారా మొండిబకాయిల (ఎన్‌పీఏ) రికవరీకి సంబంధించిన వేలంలో ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, ఎన్‌పీఏ అకౌంట్‌  హోల్డర్లు బిడ్డింగ్‌ వేయకుండా నిరోధించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి.

అయితే ఆయా వ్యక్తులు తమ బకాయిలన్నింటినీ వడ్డీలు, చార్జీలతో సహా చెల్లించేసినట్లయితే, వారు బిడ్డింగ్‌ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులవుతారు.  నవంబర్‌లో ఈ అంశంపై ఒక ఆర్డినెన్స్‌ జారీ అయింది. ఇందుకు సంబంధించే తాజా సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement