Amendment Act
-
చైనాకు చెక్ పెట్టేలా... భారత్‌కి అమెరికా అండ
US House of Representatives has passed by voice vote: చైనా వంటి దురాక్రమణ దారులకు అడ్డుకట్టవేసేలా రష్యా నుంచి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసుకునేలా భారత్‌కి అమెరికా మద్దతు ఇచ్చింది. ఈ మేరకు యూఎస్‌కి సంబంధించిన కాట్సా వంటి శిక్షార్హమైన ఆంక్షల చట్టానికి వ్యతిరేకంగా భారత్‌కి మినహయింపును ఇచ్చే శాసన సవరణను యూఎస్ ప్రతినిధులు సభ వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్(ఎన్డీఏఏ) పరిశీలనకు సంబంధించి అమెరికా ప్రతినిధుల సభ ఎన్‌బ్లాక్ సవరణలో భాగంగా ఈ శాసన సవరణను ఆమోదించింది. ఈ మేరకు అమెరికా ప్రతినిధి భారత అమెరికన్ రో ఖన్నాప్రవేశ పెట్టిన ఈ సవరణ.. చైనా నుంచి తమను తాము రక్షించుకునేలా భారత్‌కి అండగా ఉండేలా ఈ అమెరికా చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలని బైడెన్ పరిపాలన యంత్రాంగాన్ని కోరింది. ఈ నేపథ్యంలోనే భారత్‌కి యూఎస్ కఠిన చట్టం నుంచి మినహియింపు ఇచ్చేలా ప్రవేశ పెట్టిన సవరణకు ఆమెదం లభించింది. భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాల కోసం చేసిన యూఎస్ ఆమోదించిన ఈ సవరణ చట్టం అతి ప్రాముఖ్యతను సంతరిచంకుంటుందని కూడా అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అన్నారు. వాస్తవానికి కాట్సా అనేది కఠినమైన యూఎస్ చట్టం. ఇది 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడం, 2016 యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం తదితర కారణాల రీత్యా రష్యా నుంచి ఆయుధాలను కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించేలా ఈ కఠినమైన చట్టాన్ని 2017లో అమెరికా తీసుకువచ్చింది. దీంతో రష్యా రక్షణ ఇంటెలిజెన్స్ రంగాలతో లావాదేవీలు జరుపుతున్న ఏ దేశంపైనైనా యూఎస్ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా శిక్షాత్మక చర్యలను తీసుకుంటుంది. అక్టోబర్ 2018లో ఎస్400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థల ఐదు యూనిట్లను కొనుగోలు చేయడానికి రష్యాతో భారత్ 5 బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం చేసింది. ఐతే ఈ ఒప్పందంతో ముందుకు సాగడం భారత్‌కి అసాథ్యం అని యూఎస్ శిక్షర్హమైన చట్టానికి సంబంధించిన ఆంక్షలు వర్తిస్తాయంటూ అప్పటి ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది కూడా. అదీగాక ఇప్పటికే ఎస్ 400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన టర్కీపై అమెరికా ఆంక్షలు విధించడంతో భారత్‌కి భయాలు అధికమయ్యాయి. ఐతే ఈ శాసన సవరణను యూఎస్ ఆమోదించడంతో ప్రస్తుతం భారత్‌కి కాస్త ఊరట లభించింది. There is no relationship of greater significance to US strategic interests than the US-India partnership. My bipartisan NDAA amendment marks the most significant piece of legislation for US-India relations out of Congress since the US-India nuclear deal. pic.twitter.com/uXCt7n66Z7 — Rep. Ro Khanna (@RepRoKhanna) July 14, 2022 (చదవండి: తీవ్ర దుఃఖంలో ట్రంప్.. భార్య మృతితో భావోద్వేగ సందేశం) -
పాక్‌లో ప్రవాసుల ఓటు హక్కు రద్దు చేసే సవరణ బిల్లు
Pakistan To Ban Overseas Citizens From Voting, Stops Use Of EVMs: ఎలక్ట్రానిక్ యంత్రాల(ఈవీఎం)ల వినియోగాన్ని నిలిపేయడం తోపాటు, ప్రవాసులు ఓటు హక్కు రద్దు చేస్తు పాక్ నేషనల్ అసెంబ్లీ ఒక కొత్త చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. అంతేకాదు సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించడాని కంటే ముందు స్థానిక ఉప ఎన్నికల్లో మరిన్ని పైలెట్ ప్రాజెక్టులు నిర్వహించడమే ఈ బిల్లు మొదటి లక్ష్యంగా పేర్కొంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముర్తాజా జావేద్ అబ్బాసీ సమర్పించిన ఎన్నికల చట్ట సవరణ బిల్లు 2022ను దిగువ సభలో మెజారిటీ ఓట్లతో ఆమోదిం పొందింది. ఐతే ఈ బిల్లును కేవలం గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్ సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు. ఈ మేరకు ముస్లిం లీగ్ నవాజ్(పీఎంఎల్ఎన్) మంత్రి అజం నజీర్ తరార్ ఈ బిల్లు ప్రాముఖ్యతను వివరిస్తూ....ఎన్నికల చట్టం 2017 సవరణలకు ముందు ఉన్న విధంగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా ఈ బిల్లు చేస్తుందని చెప్పారు. ఈ బిల్లు చట్టంలోని సెక్షన్ 94, 107కి సంబంధించిన సవరణలని తెలిపారు. అంతేకాదు గత పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) ప్రభుత్వం ఎన్నికల చట్టం 2017కి పలు సవరణలు చేసిందని గుర్తు చేశారు. అలాగే పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ) కూడా తక్కువ సమయంలో ఈవీఎంల ద్వారా ఎలాంటి గ్రౌండ్ వర్క్ లేకుండా ఎన్నికలు నిర్వహించలేమంటూ అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని కూడా స్పష్టం చేశారు. ఐతే పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. అంతేకాదు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్ఎన్) ప్రధాన మంత్రి షెహబాజ్ షెరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వ తిరోగమన చర్యగా పేర్కొంది. పీటీఐతొమ్మిది మిలియన్లకు పైగా పాకిస్తానీ విదేశీయులకు ఓటు హక్కును కల్పిస్తే ఈ దుండగుల ప్రభుత్వం వాటిని హరించే లక్ష్యంతో సవరణలు చేసిందంటూ ఆరోపణలు గుప్పించింది. -
ఏపీ విద్యా చట్టం 1982ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టము 1982ను సవరిస్తూ శనివారం న్యాయశాఖ ప్రభుత్వ కార్యదర్శి వి.సునీత ఆర్డినెన్స్ చేశారు. ఏదైనా విద్యాసంస్ధకు ప్రభుత్వ గ్రాంటును నిలుపుదల చేయడం, తగ్గించడం, ఉపసంహరించుకోవచ్చని ఆర్డినెన్స్ ద్వారా వెల్లడించారు. అలాగే నిర్ణయం తీసుకునే ముందు ఆ సంస్ధ మేనేజరుకు ఒక అవకాశం ఇవ్వాలని విచారణ రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆర్డినెన్స్ ద్వారా సూచించారు. విచారణ సమయంలో కూడా గ్రాంటును నిలుపుదల చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెడుతూ గవర్నర్ పేరుతో ఏపీ న్యాయశాఖ ప్రభుత్వ కార్యదర్శి పేర్కొన్నారు. -
గ్రామ కంఠాల్లోని ఆస్తులకు మహర్దశ
బ్యాంకులో లోను తీసుకుని ఓ చిన్న సూపర్ మార్కెట్ ప్రారంభించాలని కలలుకంటున్న రామకోటేశ్వరరావు కల త్వరలో నేరవేరబోతోంది. బ్యాంకు లోను కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా తనఖా ఏం పెడతావ్ అంటూ బ్యాంకు వాళ్లు అడిగే ప్రశ్నకు జవాబు చెప్పలేక ఎప్పటికప్పుడు తన ఆశను చంపుకుంటూ వచ్చాడు. ఊళ్లో నాలుగు సెంట్ల స్థలంలో తల్లిదండ్రులు ఎప్పుడో కట్టిన దాదాపు రూ.20 లక్షలు విలువ చేసే ఇల్లు తప్ప అతనికి మరే ఆస్తిపాస్తుల్లేవు. ఆ ఇంటిని చూసి లోను ఇవ్వమని అడిగితే దస్తావేజులు తెమ్మమనేవారు. ఊళ్లో గ్రామకంఠం కింద ఉండే ఇళ్లకు ఎలాంటి దస్తావేజులు ఉండవని తెలిసి రామ కోటేశ్వరరావు ఆ ప్రయత్నాలు విరమించుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఇలాంటి ఆస్తులకూ ఆస్తి సర్టిఫికెటును మంజూరు చేయబోతుందని తెలిసి రామకోటేశ్వరరావు ఆనందానికి అవధుల్లేవు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి దస్తావేజుల్లేని ఆస్తుల యజమానులకు ఇది గొప్ప ఊరట. వీరి కష్టాలకు తెరదించుతూ గ్రామకంఠాల పరిధిలోని ఆస్తులకు కొత్తగా యాజమాన్య హక్కు (ఆస్తి సర్టిఫికెట్లు)ను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసేందుకు ఇటీవల సమావేశమైన కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. దీంతో ఇన్నాళ్లూ అవకాశం లేకుండాపోయిన క్రయవిక్రయాలను ఇప్పుడు అధికారికంగా ఎంతో ధీమాగా చేసుకోవచ్చు. పూర్వం ఎప్పుడో గ్రామ కంఠాలుగా వర్గీకరణ చేసిన ప్రాంతంలో ఇళ్లు, ఇతర ఖాళీ స్థలాలున్న వారికి ఇప్పటివరకు వాటిని ఉపయోగించుకోవడమే కానీ, మరే విధంగా అవి అక్కరకు రాని ఆస్తిగా తయారయ్యాయి. దీంతో అవి రూ.లక్షల విలువ చేసినా అవసరమైనప్పుడు వాటి ద్వారా ఒక్క రూపాయి కూడా రుణం పొందే అవకాశంలేదు. వాటిని అమ్మినా, కొన్నా అవన్నీ అనధికారికంగా జరిగే లావాదేవీలే. 90 లక్షల ఇళ్లు.. 30 లక్షల స్థలాలు రాష్ట్రంలో 17,950 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిల్లో గ్రామ కంఠాల పరిధిలో ఇళ్లు, స్థలాలున్న వారికి రెవెన్యూ శాఖ యజమాన్య హక్కు ఇచ్చే విధానంలేదు. వీటికి సంబంధించి రెవెన్యూ లేదా పంచాయతీల వద్ద ఎలాంటి ప్రత్యేక రిజిస్టర్లు లేవు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి గ్రామ కంఠాల పరిధిలో 90 లక్షల ఇళ్లు, మరో 30 లక్షల సంఖ్యలో ఇతర ఖాళీ స్థలాలు ఉంటాయని పంచాయతీరాజ్ శాఖ అధికారుల అంచనా. వీటన్నింటి విలువను లెక్కిస్తే రూ.10 లక్షల కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. చట్ట సవరణ తర్వాత ప్రతి ఆస్తికీ సర్టిఫికెట్ ఈ నేపథ్యంలో.. గ్రామ కంఠం పరిధిలో ప్రతి ఇల్లు, ఖాళీ స్థలానికి వేర్వేరుగా సంబంధిత యజమానులకు ఆస్తి సర్టిఫికెట్ల జారీకి వీలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ చట్టానికి సవరణలు చేస్తోంది. అసెంబ్లీలో ఈ చట్ట సవరణకు ఆమోదం లభించాకే ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత ప్రతి ఆస్తిని యజమాని పేరుతో రెవెన్యూ, గ్రామ పంచాయతీ రికార్డులలో నమోదు చేస్తారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష పథకంలో గ్రామ కంఠంలో ఉండే ఆస్తులకూ డ్రోన్ల సహాయంతో సర్వే నిర్వహిస్తారు. ఒక్కొక్క దానికి ప్రత్యేక నెంబరును కేటాయించి ఆ మేరకు యజమానికి క్యూఆర్ కోడ్‌తో కూడిన ఆస్తి సర్టిఫికెట్‌ను జారీచేస్తారు. కాగా, రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో ఈ సర్వే ప్రక్రియ పూర్తవగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున 51 గ్రామాలలో సర్వే కొనసాగుతోంది. ఇళ్ల విలువ పెరిగే అవకాశం ఇదిలా ఉంటే.. ఆస్తి సర్టిఫికెట్ జారీతో యజమానికి పూర్తి ఆర్థిక భరోసా లభించినట్లవుతుంది. ఆ ఆస్తిని తాకట్టు పెట్టి బ్యాంకు లోన్లు పొందే వీలుంటుంది. క్రయవిక్రయాలు లేదా ఆస్తి పంపకాలు సులభంగా జరుపుకోవచ్చు. ఇదే సమయంలో ఆ ఆస్తులకు ప్రస్తుతమున్న ధర కంటే భారీగా రేటు పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. -
జాబితాల జగడం
-
రణరంగంగా మారిన దేశ రాజధాని
-
ఎస్పీజీ చట్టానికి ప్రక్షాళన
దేశంలో ప్రముఖుల భద్రత కోసం ఉద్దేశించిన ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీజీ) చట్టం సవరణకు పార్లమెంటు ఆమోదం లభించింది. తాజా సవరణ చట్టంగా మారాక ఇక ప్రధాని, ఆయన కుటుంబానికి చెందిన వారికి తప్ప మరెవరికీ ఎస్పీజీ రక్షణ ఉండదు. వారికి సైతం పదవి నుంచి దిగిపోయాక ఇది అయిదేళ్లపాటు మాత్రమే ఉంటుంది. వాస్తవానికి ఈ బిల్లు ఆమోదానికి చాలా ముందే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఉన్న ఎస్పీజీ భద్రతను తొలగించారు. ఇటీవల సోనియాగాంధీ, ఆమె సంతానం రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలకు సైతం తొలగించారు. వీరికి ఇకపై సీఆర్పీఎఫ్ బృందంతో కూడిన జడ్ ప్లస్ భద్రత ఉంటుంది. సహజంగానే కాంగ్రెస్‌కు ఇది మింగుడుపడటం లేదు. ఎస్పీజీ బిల్లుపై చర్చ పూర్తయి ఓటింగ్ జరిగినప్పుడు ఆ పార్టీ వాకౌట్ చేసింది. మన దేశంలో ప్రముఖులకు సంబంధించిన భద్రత కోసం చాలా కేటగిరీలున్నాయి. ఎస్పీజీతోపాటు ఎన్ఎస్జీ, జడ్ ప్లస్, జడ్, వై, ఎక్స్...ఇలా వేర్వేరు కేటగిరీలను ఏర్పాటుచేశారు. ప్రాణావసరం అనుకున్నది కాస్తా ప్రచార ఆర్భాటంగా మిగలడం, అధికార దర్పాన్ని ప్రదర్శించ డానికి సాధనంగా మారడం మిగిలినవాటికన్నా ఎస్పీజీ విషయంలో అధికంగా కనబడుతుంది. రాజ్యాంగపరంగా అత్యున్నత పదవుల్లో ఉండేవారి ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చూడటం అవసరమే. ఉగ్రవాదుల బెడద పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో దీన్నెవరూ తప్పుబట్టరు. అయితే రాను రాను భద్రత ఎవరికి అవసరం... ఏ స్థాయిలో, ఎంతకాలం అవసరం అనే విచక్షణ పోయింది. ఎస్పీజీ చట్టానికి సవరణలు చేసుకుంటూ పోయినకొద్దీ ఆ రక్షణ పొందేవారి జాబితా చాంతాడంత పెరిగింది. జాబితాలోనివారికి ఉండే వెసులుబాట్లు అన్నీ ఇన్నీ కాదు. వీరు పర్యటనకెళ్లినప్పుడల్లా బుల్లెట్ ప్రూఫ్ కార్లు వారికన్నా ముందే విమానంలో గమ్యం చేరతాయి. విమానాశ్రయాల్లో తనిఖీల బెడద ఉండదు. నేరుగా విమానం వరకూ దర్జాగా కారులో వెళ్లొచ్చు. సాధారణ పౌరులు వారు వృద్ధులైనా, యువకులైనా గంటలతరబడి క్యూలో నిలబడి అన్ని లాంఛనాలూ పూర్తిచేయాల్సి ఉండగా ఎస్పీజీ రక్షణ ఉన్నవారికి ఇవేమీ వర్తించవు. ఎటు కదిలినా వీరి వాహనానికి ముందూ వెనకా 15 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు పరుగులు పెడుతుంటాయి. ఈ వాహనశ్రేణి కోసం ఎక్కడి కక్కడ ట్రాఫిక్ నిలిపేయడం సర్వసాధారణం. స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో పాలకుల ప్రాణరక్షణకు ప్రత్యేక భద్రత అవసరమని పెద్దగా అనుకోలేదు. వారు ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి నామ మాత్రంగా పోలీసు రక్షణ ఉండేది. ప్రధాని మొదలుకొని మంత్రుల వరకూ ఎవరు కదిలినా ఆర్భాటం ఉండేది కాదు. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నివాసంలోనే సెక్యూరిటీ గార్డుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయాక ఈ పరిస్థితి మారింది. 1981కి ముందు ప్రధాని భద్రతను ఢిల్లీ పోలీస్ విభాగంలోని డీసీపీ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం పర్యవేక్షించేది. ఆ తర్వాతకాలంలో అందుకోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేశారు. ఇందిర హత్యానంతరం 1985లో బీర్బల్‌నాథ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎస్పీజీ ఉనికిలోకొచ్చింది. అయితే మరో మూడేళ్ల తర్వాతగానీ దీనికి చట్ట ప్రతిపత్తి రాలేదు. రాజీవ్‌గాంధీ హయాంలో దానికి సంబంధించిన బిల్లు ప్రతిపాదించారు. అయితే పదవి నుంచి తప్పుకున్నాక కూడా రక్షణ అవసరమని అప్పట్లో అనుకోలేదు. బహుశా ఆ ఏర్పాటువుంటే ఉగ్రవాదుల కుట్రకు రాజీవ్ బలయ్యేవారు కాదు. ఆ తర్వాత 1991లో మాజీ ప్రధానులకు కూడా ఎస్పీజీ రక్షణ ఉండాలంటూ సవరణ చేశారు. అలా వరసగా 1994, 1999, 2003 సంవత్సరాల్లో మరికొన్ని సవరణలు వచ్చి చేరాయి. ఫలితంగా ప్రధాని, మాజీ ప్రధాని, వారి కుటుంబసభ్యులు సైతం ఎస్పీజీ ఛత్రఛాయలోకొచ్చారు. ప్రధాని పదవి నుంచి వైదొలగిన పదేళ్ల వరకూ ఈ రక్షణ కొనసాగే ఏర్పాటు చేశారు. ప్రముఖులకు కల్పించే భద్రత ఈమధ్య కాలంలో ఎబ్బెట్టుగా మారింది. పదకొండేళ్లపాటు ఈ ఎస్పీజీ రక్షణ వలయంలో ఉన్న మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ రాజ్యసభలో చర్చ సందర్భంగా మాట్లాడిన మాటలే దీనికి రుజువు. తనకంటూ ఏ పదవీ, హోదా లేకపోయినా ఎస్పీజీ రక్షణంతా చూసి జనం తన ఆటోగ్రాఫ్ కోసం ఎగబడేవారని ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి తనెవరో దేశంలో ఎవరికీ తెలియదని, కానీ ఈ భద్రత, దాంతో పాటుండే హడావుడి వగై రాలు చూసి ఏదో పెద్ద పదవి వెలగబెడుతున్నానని అందరూ అనుకునేవారని నీరజ్ చెప్పుకొచ్చారు. ఇవన్నీ చూశాకే సాధారణ పౌరుల్లో వీఐపీ సంస్కృతిపై ఏవగింపు ఏర్పడింది. ఇంత భద్రత పొందుతున్న వీఐపీలు పాటించవలసిన నిబంధనల్ని మాత్రం మరిచిపోతారు. ఎస్పీజీ రక్షణలో ఉండే ప్రముఖులు ఎటు వెళ్లదల్చుకున్నా చాలా ముందుగా ఎక్కడికెళ్తున్నారో, తిరిగి ఎప్పుడొస్తారో భద్రతా వ్యవహారాలు చూసే ఇన్చార్జికి తెలపాలి. అలాగే వారికోసం వచ్చేవారి సమస్త వివరాలనూ ఎస్పీజీ ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేస్తుంది. కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకారం 2015 మొదలుకొని ఇప్పటివరకూ రాహుల్‌గాంధీ దేశంలో వివిధ ప్రాంతాలకెళ్లినప్పుడు 1,892 సందర్భాల్లో, విదేశాలకెళ్లినప్పుడు 247 సందర్భాల్లో ఎస్పీజీకి వర్త మానం ఇవ్వలేదు. సోనియాగాంధీ సైతం ఢిల్లీలో 50సార్లు, దేశంలో వివిధ ప్రాంతాలకెళ్లినప్పుడు 13సార్లు, విదేశాలకెళ్లినప్పుడు 29సార్లు తెలియజేయలేదు. ప్రియాంకగాంధీ తీరు కూడా భిన్నంగా లేదు. ఆమె ఢిల్లీలో 339 సందర్భాల్లో, దేశంలో వేర్వేరు ప్రాంతాలకెళ్లినప్పుడు 64సార్లు, విదేశా లకెళ్లినప్పుడు 94సార్లు వర్తమానం ఇవ్వలేదు. భద్రత లాంఛనంగా మారడం సరికాదు. పదవులు విడనాడాక నాయకులే ఎవరికి వారు స్వచ్ఛందంగా భద్రత స్థాయిని తగ్గించుకుంటే హుందాగా ఉంటుంది. ఎందుకంటే దీని పేరు చెప్పి ఖజానాపై ఏటా వందలకోట్ల రూపాయల భారం పడు తోంది. పైగా ఈ ఆర్భాటం సామాన్యులకు సమస్యగా మారుతోంది. -
‘ఆధార్’ చట్ట బద్ధతపై సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: ఆధార్ సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటుపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలు తెరవడానికి, మొబైల్ కనెక్షన్లు పొందడానికి వినియోగదారులు స్వచ్ఛందంగా తమ గుర్తింపు పత్రం కింద ఆధార్ నంబర్‌ను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం ఎంతవరకు సరైందన్న అంశాలనూ సుప్రీం విచారించనుంది. ఆధార్ సవరణ చట్టం పౌరుల వ్యక్తిగత భద్రత, గోప్యతకు భంగం వాటిల్లేలా ఉందని, ఇది ప్రాథమిక హక్కుల్ని కాలరాయడమేనని దాఖలైన ప్రజా ప్రయోజనా వ్యాజ్యాన్ని సుప్రీం శుక్రవారం విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన సుప్రీం బెంచ్ కేంద్రానికి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)లకు నోటీసులు జారీ చేసింది. కొన్ని మినహాయింపులతో ఆధార్ చట్టం రాజ్యాంగబద్ధమేనని గత ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. జూలైలో ఆధార్ సవరణ చట్టం సుప్రీం తీర్పుతో కేంద్రం ఆధార్, ఇతర చట్టాలకు సవరణలు తీసుకువచ్చింది. వినియోగదారులు తమ వ్యక్తిగత వివరాలను అందించడంలో స్వచ్ఛందంగా 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఉపయోగించడానికి వీలు కల్పిస్తూ ఆధార్, ఇతర చట్టాలకు సవరణలు చేసింది. ఈ బిల్లును జూలై 8న పార్లమెంటు ఆమోదించింది. తాజాగా ఆర్మీ మాజీ అధికారి ఎస్జీ వోంబట్కెరె, సామాజిక కార్యకర్త విల్సన్ ఆధార్ (సవరణ) చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ పిల్ దాఖలు వేశారు. దీనిపై కేంద్రానికి, యూఐడీఐఏకు సుప్రీం నోటీసులు పంపింది. -
అక్కడ 24 గంటలకు మించి ఉంటే ఆంక్షలే!
షిల్లాంగ్: మేఘాలయ రాష్ట్రవాసులు కాకుండా.. బయటి వ్యక్తులు ఎవరైనా.. 24 గంటలకు మించి మేఘాలయాలో ఉండాలనుకుంటే ప్రభుత్వానికి నివేదించాలి. ఈ మేరకు మేఘాలయా వాసుల కోసం ఉద్దేశించిన భద్రతా చట్టం 2016 (ఎంఆర్‌ఎస్‌ఎస్‌ఏ)లో సవరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం మేఘాలయా రాష్ట్రంలోకి ప్రవేశించే బయటి వ్యక్తులు తప్పనిసరిగా తమ వివరాలు అధికారుల వద్ద నమోదు చేయాల్సి ఉంటుంది. త్వరలో జరగబోయే శాసనసభ సమావేశాల్లో ఆమోదం పొందిన వెంటనే ఇది అమల్లోకి వస్తుందని ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్ టిన్సోంగ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర, జిల్లా కౌన్సిల్ ఉద్యోగులకు ఈ చట్టం వర్తించదని వెల్లడించారు. రాష్ట్రంలోకి ప్రవేశించే అక్రమ వలసదారులను కట్టడి చేసేందుకు రూపొందించిన ఎంఆర్‌ఎస్‌ఎస్‌ఏను 2016లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిందని గుర్తుచేశారు. భద్రత అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తాజా సవరణ ప్రతిపాదించినట్టు చెప్పారు. మేఘాలయ ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్ టిన్సోంగ్ బయటి వ్యక్తులు సులువుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా నిబంధనలు ప్రతిపాదిస్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఎవరైనా తప్పుడు సమాచారం, నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే.. చట్ట ప్రకారం శిక్షార్హులుగా పరిగణించబడతారని అన్నారు. అసోంలో భారత పౌరులను గుర్తించే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ) అమలు చేసి గత ఆగస్టులో 19 లక్షల మందిని అసోం పౌరులుగా గుర్తించలేదు. కాగా అసోం తరహాలోనే మేఘాలయ ప్రభుత్వం అక్రమ వలసదారులను గుర్తించి చర్యలు చేపట్టనుంది. -
చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక బిల్లుకు ఓకే
సాక్షి, న్యూఢిల్లీ : చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లుకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లుపై జరిగిన చర్చలో హోంమంత్రి అమిత్ షా పాల్గొంటూ విపక్షాల అభ్యంతరాను ఆక్షేపించారు. ఈ చట్టం కాంగ్రెస్ హయాంలోనే రూపొందిందని మీరు అధికారంలో ఉన్నప్పుడు తీసుకువచ్చిన చట్టాన్ని తాము పటిష్టం చేస్తున్నామని చెప్పారు. అప్పుడు మీరు సరైనదైతే తాము ఇప్పుడు చేస్తున్నదీ సరైనదేనని స్పష్టం చేశారు. ఓ వ్యక్తిని ఉగ్రవాదిగా ప్రకటించేందుకు వెసులుబాటు ఉండేలా నిబంధన ఉండాల్సిన అవసరం ఉందని హోంమంత్రి స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితిలో, అమెరికా, పాకిస్తాన్‌లోనూ చట్టపరిధిలో ఈ నిబంధనలు ఉన్నాయని గుర్తుచేశారు. చైనా, ఇజ్రాయెల్, ఐరోపా యూనియన్లోనూ ఈ నిబంధన ఉందని చెప్పుకొచ్చారు. భారత్‌లో ఎంతో మంది ప్రశంసనీయంగా సామాజిక సేవలో నిమగ్నమయ్యారని ఆయన పేర్కొన్నారు. అర్బన్ మావోయిజం కోసం పనిచేసే వారి పట్ల తమకు ఎలాంటి సానుభూతి లేదని అన్నారు. -
ఆధార్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు, మొబైల్ కనెన్షన్ పొందేందుకు ఆధార్ కార్డును వాడేందుకు ఉద్దేశించిన ఆధార్, ఇతర బిల్లుల(సవరణ) చట్టం– 2019కు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం బ్యాంకు ఖాతాల కోసం, మొబైల్ కనెక్షన్ల కోసం ఆధార్‌ను ప్రజలు స్వచ్ఛందంగా ఇవ్వొచ్చు. లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ మాట్లాడుతూ..‘ప్రజల వ్యక్తిగత గోప్యత, భద్రత కోసం ఈ సవరణలు తెచ్చాం. ఆధార్ లేని కారణంగా ఎవ్వరికీ సంక్షేమ ఫలాలు నిరాకరించం. ప్రైవేటు సంస్థలు ఏవైనా ప్రజల ఆధార్ డేటాను నిల్వచేస్తే రూ.1కోటి జరిమానాతో పాటు జైలుశిక్ష పడుతుంది. ఐటీ మంత్రి హోదాలో ఓ వ్యక్తి ఆధార్ వివరాలను నేను కోరినా నాకూ మూడేళ్లశిక్ష పడుతుంది. ఆధార్ వివరాలను దేశభద్రతకు ముప్పు తలెత్తినప్పుడు, కోర్టులు ఆదేశించినప్పుడే పంచుకోవడానికి వీలవుతుంది. ఆధార్ కార్డుల్లోని పౌరుల వ్యక్తిగత సమాచారం భారత్‌లో సురక్షితంగా, భద్రంగా ఉంది’ అని తెలిపారు. ప్రస్తుతం 123 కోట్ల మంది ఆధార్‌ను వాడుతున్నారనీ, దీని కారణంగా ప్రభుత్వం రూ.1.41 లక్షల కోట్లు ఆదా చేయగలిగిందని వెల్లడించారు. ఆధార్ సాయంతో 4.23 కోట్ల నకిలీ ఎల్పీజీ కనెక్షన్లు, 2.98 కోట్ల బోగస్ రేషన్ కార్డులను తొలగించామన్నారు. త్వరలోనే డేటా సంరక్షణ చట్టాన్ని తెస్తామన్నారు. ఈ బిల్లును ఎన్సీపీ, సీపీఎం, ఏఐఎంఐఎం, ఐయూఎంఎల్ పార్టీలు వ్యతిరేకించాయి. ఎంసీఐ బిల్లుకు రాజ్యసభ ఓకే: భారత వైద్య మండలి(సవరణ) బిల్లు–2019కు పార్లమెంటు గురువారం ఆమోదించింది. ఇందులోని నిబంధనల మేరకు ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంసీఐకి బదులుగా గవర్నర్ల బోర్డు 2018, సెప్టెంబర్ 26 నుంచి మరో రెండేళ్ల పాటు పాలన నిర్వహించనుంది. ఈ బిల్లును రాజ్యసభలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రవేశపెట్టగా మూజువాణీ ఓటుతో ఆమోదం పొందింది. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. ‘ఎంసీఐ తన విధి నిర్వహణలో ఘోరంగా విఫలమైంది. కాబట్టి ఎంసీఐని నిర్వహించే బాధ్యతను ప్రముఖ డాక్టర్లతో కూడిన గవర్నర్ల బోర్డుకు అప్పగించాం. మేం ఈ బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోం. కానీ పర్యవేక్షణ మాత్రం కొనసాగుతుంది’ అని తెలిపారు. అలాగే బోర్డు సభ్యుల సంఖ్యను 7 నుంచి 12కు పెంచుతామన్నారు. అద్దాల భవంతులపై ఆధారాల్లేవు.. అద్దాలతో నిర్మించిన భారీ భవంతులు ఎక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటాయనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ లోక్‌సభలో తెలిపారు. ఓ భవనాన్ని అద్దాలతో పక్కాగా డిజైన్ చేస్తే లాభాలే ఎక్కువని వ్యాఖ్యానించారు. ‘ఈ విషయంలో గతంలో ఏవైనా అధ్యయనాలు జరిగిఉంటే నా దృష్టికి తీసుకురండి. పరిశీలిస్తాను. న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో నేను ఐదేళ్లు సంతోషంగా, నిక్షేపంగా ఉన్నా’ అని మంత్రి పేర్కొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలపై స్టేకు సుప్రీం నో
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలపై స్టే జారీ చేసేందుకు సర్వోన్నత న్యాయస్ధానం నిరాకరించింది. ఈ చట్టం కింద నిందితులకు ముందస్తు బెయిల్ నిరాకరించడాన్ని తిరిగి చట్టంలో జోడిస్తూ తీసుకువచ్చిన సవరణలపై స్టే ఇవ్వాలన్న అప్పీల్‌ను నిలిపివేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు గతంలో వెలువరించిన తీర్పుపై కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌తో పాటు అన్ని అంశాలను ఫిబ్రవరి 19న విచారణ చేపడతామని న్యాయస్ధానం వెల్లడించింది. ఈ అంశాన్ని లోతుగా విచారించాల్సిన అవసరం ఉన్నందున దీనికి సంబంధించిన అన్ని అంశాలను వచ్చే నెల 19న వాద, ప్రతివాదనలను కోర్టు పరిశీలిస్తుందని జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ పేర్కొంది. చట్టానికి చేసిన మార్పులను తక్షణమే నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదించగా, ఎస్సీ, ఎస్టీ చట్టానికి చేసిన సవరణలపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద విచారణ లేకుండానే అరెస్టులు వద్దంటూ గతంలో సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఈ చట్టాన్ని బలోపేతం చేస్తూ గత ఏడాది ఆగస్ట్ 9న పార్లమెంట్ ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక సవరణ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. -
ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణపై స్టేకు సుప్రీం నిరాకరణ
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద నిందితుడికి ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ తీసుకువచ్చిన ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్ట సవరణ, 2018పై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్ధానం గురువారం నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణను సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను, మార్చి 20న ఈ అంశంపై సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్లను కలిపి విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఈ చట్టాన్ని నిర్వీర్వం చేస్తుందనే ఆందోళనతో గత ఏడాది ఆగస్ట్ 9న ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్ట సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ చట్టం తీవ్రంగా దుర్వినియోగమవుతుందంటూ దీనికి సంబంధించిన ఫిర్యాదులపై తక్షణ అరెస్ట్‌లను నిలువరించాలన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చుతూ ప్రభుత్వం నూతన సవరణలు చేపట్టింది. కాగా ఎస్సీ,ఎస్టీ వేధింపుల చట్టం కింద ప్రభుత్వ ఉద్యోగిపై దాఖలైన కేసుల్లో నిర్ధిష్ట అధికారి నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాతే అరెస్ట్ చేయాలనే నిబంధనలు సహా సుప్రీం కోర్టు పలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిని పరిష్కరిస్తూ ఈ చట్టానికి కోరలు తెచ్చేలా పార్లమెంట్లో ప్రభుత్వం సంబంధిత చట్టానికి నూతన సవరణలు ప్రతిపాదించింది. -
కామాంధులకు మరణశిక్షే
న్యూఢిల్లీ: చిన్నారులపై లైంగిక నేరాలను నిరోధించేందుకు కేంద్రం తెచ్చిన పోక్సో చట్టం–2012 పటిష్టం కానుంది. 18 ఏళ్లలోపు అమ్మాయిలు, అబ్బాయిలపై లైంగికదాడికి పాల్పడేవారికి మరణదండన విధించేలా పోక్సో చట్టానికి చేసిన సవరణలకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను ఐటీ మంత్రి రవిశంకర్ మీడియాకు చెప్పారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 4, 5, 6(18 ఏళ్లలోపువారిపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణశిక్ష) సెక్షన్ 9(ప్రకృతి విపత్తుల సమయంలో చిన్నారులపై లైంగికదాడి నుంచి రక్షణ) సెక్షన్ 14, 15(చిన్నారుల అశ్లీలచిత్రాల నియంత్రణ)లను సవరించినట్లు తెలిపారు. ఈ మూడు సవరణలు లైంగికనేరాల నిరోధానికి ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. చిన్నారుల అశ్లీల చిత్రాలను కలిగిఉన్న వ్యక్తులకు జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండింటిని విధించేలా సెక్షన్ 14, 15ను సవరించారు. మరికొన్ని కేబినెట్ నిర్ణయాలు.. ► దేశంలోని కొబ్బరి రైతులకు కేంద్రం ఊరట కలిగించింది. గుండు కొబ్బరి పంటకు అందిస్తున్న మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.2,170 మేర పెంచుతూ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ గుండు కొబ్బరి ధర క్వింటాల్‌కు రూ.7,750 ఉండగా, తాజా పెంపుతో అది రూ.9,920కు చేరుకుంది. అలాగే మిల్లింగ్ ఎండు కొబ్బరి క్వింటాల్ ధరను రూ.2,010 పెంచింది. దీంతో దీని మద్దతుధర రూ.9,521కు పెరిగింది. ► ఉల్లి ఎగుమతులపై అందిస్తున్న 5 శాతం ప్రోత్సాహకాలను 10 శాతానికి పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ► జాతీయ హోమియోపతి కమిషన్ ఏర్పాటుకు ఉద్దేశించిన నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ► సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) స్థానంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్(ఎన్‌సీఐఎం) ముసాయిదా బిల్లు–2018కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. -
ఫోన్లో మాట్లాడుతూ నడిపితే 5 వేలు ఫైన్!
రోడ్డు ప్రమాదాల నివారణకు అత్యంత కీలకంగా భావిస్తోన్న మోటారువాహనాల సవరణ బిల్లు 2017, లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. రాష్ట్రప్రభుత్వాల అధికారాలను ఈ బిల్లు నియంత్రిస్తోందనీ, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైందన్న ఆరోపణలతో విపక్షాలు ఈ బిల్లుని అడ్డుకున్నాయి. అయితే విచ్చలవిడిగా జరుగుతోన్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించే కీలకమైన అంశాలు ఈ బిల్లులో పొందుపరిచారు. యేడాదికి 1.46 లక్షల ప్రమాదాలతో ప్రపంచంలోనే ప్రథమస్థానంలో ఉన్న భారతదేశం 2020 కల్లా రోడ్డు ప్రమాదాలను 50 శాతం తగ్గించాలని ఐక్యరాజ్యసమితి సూచించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రమాదాల అంచున సాగే ప్రయాణాలకు ఫుల్ స్టాప్ పడుతుందని అంతా ఆశిస్తున్నారు. ట్రాఫిక్ అతిక్రమణలకు విధించే ఫైన్లు మొదలుకొని, ప్రమాదాలకు కారణమైన మైనర్ల విషయంలో వాహన యజమానులను సైతం బాధ్యులను చేసేలా ఈ బిల్లుని తయారుచేశారు. ఈ బిల్లులో ఏముంది? 1. వాహన రిజిస్ట్రేషన్‌కీ, డ్రైవింగ్ లైసెన్స్‌కీ ఆధార్ తప్పనిసరి. 2. వాహనాలు ఢీ కొట్టి పారిపోయిన దుర్ఘటనల్లో ప్రభుత్వమే బాధితులకు నష్టపరిహారంగా ప్రస్తుతం చెల్లిస్తోన్న 25,000 రూపాయలను 2 లక్షలకు పెంచారు. 3. ప్రమాదాలకు మైనర్లు కారణమైన సందర్భంలో వాహనయజమాని కానీ, సదరు మైనరు సంరక్షకులుగానీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ సంరక్షకులకు గానీ, వాహన యజమానులకు గానీ ఈ ప్రమాదం తెలియకుండా జరిగినట్టు, లేదా తాము నివారించే ప్రయత్నం చేసామని నిరూపించుకుంటే తప్ప వారే మైనర్ల ప్రమాదాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అది వారికి తెలిసి జరిగినట్టయితే మోటారు వాహనం రిజిస్ట్రేషన్ రద్దుఅవుతుంది. జువైనల్ చట్టం ప్రకారం నేరస్తులను విచారిస్తారు. 4. ప్రమాదంలో ఉన్న వారిని ఆదుకునే వారికి ఈ బిల్లు రక్షణకల్పిస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు తోడ్పడిన వారిని నేరంలో భాగం చేయకుండా ఇది నివారిస్తుంది. బాధితులను ఆసుపత్రిలో చేర్చినప్పుడు సైతం వారు కోరితే వారి వివరాలను పోలీసులు, ఆసుపత్రి వర్గాలు గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది. 5. మత్తుపానీయాలు సేవించి వాహనాలు నడిపిన వారికి ఇప్పుడు విధించే ఫైన్‌ని 2000 నుంచి 10,000 రూపాయలకు పెంచారు. 6. ఇష్టమొచ్చినట్టు రాష్‌గా వాహనాలు నడిపితే విధించే జరిమానాను 1000 రూపాయల నుంచి 5000 రూపాయలకు పెంచారు. 7. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన నేరానికి యిప్పుడు విధిస్తోన్న 500 రూపాయల జరిమానాను 5000 రూపాయలకు పెంచారు. 8. అతివేగంగా వాహనాలు నడిపినందుకు ప్రస్తుతం విధిస్తున్న 400 రూపాయల ఫైన్‌ని 1000, 2000 వరకు పెంచారు. 9. సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనం నడిపితే ప్రస్తుతం 100 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. దాన్ని 1000 రూపాయలకు పెంచారు. 10. ఫోన్లో మాట్లాడుతూ వాహనాన్ని నడిపితే ప్రస్తుతం 1000 రూపాయల ఫైన్ వేస్తున్నారు. అది 5000లకు పెంచారు. 11. మోటారు వాహనాల యాక్సిడెంట్ ఫండ్‌లో ఇన్సూరెన్స్ ని కూడా చేర్చారు. 12. దివ్యాంగులకు అవసరమైన రీతిలో వాహనాల నిర్మాణాన్ని తప్పనిసరిచేసారు. 13. నాణ్యతలేని రోడ్లను వేసినందుకు కాంట్రాక్టర్లు సైతం ప్రమాదాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. 14. రోడ్డు ప్రమాదాల్లో ఆరునెలల లోపే బాధితులు నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 15. ప్రమాదాల్లో మరణాలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పరిమితిని 10 లక్షలు, తీవ్రమైన గాయాలకు 5 లక్షల చొప్పున చెల్లించాలని 2016 చట్టం పేర్కొంది. ఇప్పుడు 2017 మోటారు వాహనాల బిల్లు ఈ పరిమితిని ఎత్తివేసింది. 16. కాలం తీరిన డ్రైవింగ్ లైసెన్స్‌ని తిరిగి నమోదుచేయించుకోవడానికి గతంలో ఉన్న నెల రోజుల గడువుని యేడాదికి పెంచారు. 17. ఉండాల్సిన స్థాయిలో వాహనం మోటారు నాణ్యత లేనట్టు భావిస్తే ఆయా వాహనాలను ప్రభుత్వమే తిరిగి రప్పించుకోవచ్చు. తక్కువ నాణ్యత కలిగిన వాహనాలు తయారు చేసినందుకుగాను 500 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఈ బిల్లులో కల్పించారు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
దివాలా చట్టానికి సవరణ; లోక్‌సభలో బిల్లు
న్యూఢిల్లీ: ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ (సవరణ) బిల్లు 2017ను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దివాలా ప్రొసీడింగ్స్ ద్వారా మొండిబకాయిల (ఎన్పీఏ) రికవరీకి సంబంధించిన వేలంలో ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, ఎన్పీఏ అకౌంట్ హోల్డర్లు బిడ్డింగ్ వేయకుండా నిరోధించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి. అయితే ఆయా వ్యక్తులు తమ బకాయిలన్నింటినీ వడ్డీలు, చార్జీలతో సహా చెల్లించేసినట్లయితే, వారు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులవుతారు. నవంబర్‌లో ఈ అంశంపై ఒక ఆర్డినెన్స్ జారీ అయింది. ఇందుకు సంబంధించే తాజా సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. -
‘ఎర్ర’ బంగారంపై చట్ట సవరణ
పదేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా సవరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం జిల్లాలో పాతస్మగ్లర్ల ఆస్తులజప్తు చేయొచ్చు కాలం చెల్లిన శిక్షలు ఇక కనుమరుగు చిత్తూరు (అర్బన్): ప్రపంచంలో శేషాచలం అడవుల్లో మాత్రమే లభ్యమయ్యే ఎర్రచందనం చెట్లను కాపాడుకోవడానికి చట్టాన్ని కఠినతరం చేశారు. జాతీయ సంపదను రక్షించడానికి రాష్ట్ర అటవీశాఖ చట్టం - 1967కు సవరణ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. కొత్త చట్టం ఇలా.. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పట్టుబడ్డ వారిని అరెస్టు చేయడం, వారు జైలుకు వెళ్లి బెయిల్‌పై రావడం మామూలైపోయింది. నూతన చట్టం మేరకు.. నేరం రుజువయితే పదేళ్ల జైలుశిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. స్మగ్లర్లపై కేసులు నమోదు చేసే అధికారం పోలీసులతో పాటు అటవీశాఖ అధికారులకు సైతం కల్పించారు. ఇక డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో కేసులు విచారిస్తారు. దీనికి తోడు ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పట్టుబడ్డ నేరస్తుల ఆస్తులను సైతం జప్తు చేయడానికి ఇందులో వీలు కల్పించారు. గత ఐదేళ్లలో జిల్లా నుంచి 10 వేల టన్నుల ఎర్రచందనం సరిహద్దులు దాటింది. దీనిని అక్రమంగా రవాణా చేస్తున్న 12,356 మందిని పోలీసులు గుర్తించారు. పలు పోలీసు స్టేషన్లలో 864 కేసులు నమోదయ్యాయి. అయితే వీళ్లల్లో ఇప్పటి వరకు కేవలం 5,342 అరెస్టయ్యారు. ఇందులో చైనాకు చెందిన ఇద్దరు విదేశీయులతో పాటు 70 మంది అంతర్జాతీయ స్మగ్లర్లు ఉన్నారు. తిరుపతి, చిత్తూరు పోలీసులు జిల్లాలో 62 మందికి పైగా నిందితులపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టు కింద కేసులు నమోదు చేశారు. బడా స్మగ్లర్లు ఎర్రచందనం తరలింపులో రూ.వేల కోట్లు కూడబెట్టినట్లు పోలీసులు గుర్తించినా వాటిని ప్రభుత్వ పరం చేయడంలో చట్టం అడ్డంకిగా మారింది. తాజాగా అటవీశాఖ చట్టాన్ని సవరించడంతో పాత స్మగ్లర్ల వద్ద గుర్తించిన ఆస్తులను స్వాధీనం చేసుకునే వె సులుబాటు కల్పించారు. అయితే చట్టాన్ని అమలు చేయడంలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించినప్పుడే చేసిన సవరణకు ప్రతిఫలం ఉంటుంది. -
ఇక మందేస్తే ఓటు హక్కు లేనట్లే..!
న్యూఢిల్లీ: సిక్కుల 91 ఏళ్ల కిందటి చట్టానికి చేసిన మార్పులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. దీని ప్రకారం చండీఘడ్‌లోని సిక్కుల గురుద్వార్లకు జరిగే ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తులు కొన్ని కచ్చితమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది. వాటిని పాటించనట్లయితే ఆ సంస్థలకు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కును కోల్పోతారు. ది సిక్ గురుద్వారాస్(సవరణ) చట్టం 2016 ప్రకారం ఎవరైతే తమ జుట్టును, గడ్డాన్ని ట్రిమ్ చేసుకోవడంగానీ, షేవ్ చేసుకోవడంగానీ చేస్తారో.. అలాగే మద్యం తాగడం, పొగతాగడంలాంటివి చేస్తారో వారికి గురుద్వారాలకు జరిగే ఎన్నికల్లో ఓటేసే హక్కు ఉండదు. ఈ మేరకు పార్లమెంటులో చట్టం చేసి ఆమోదించగా దాని రాష్ట్రపతి సమ్మతి తెలిపారు. గతంలోని 1925నాటి గురుద్వారా చట్టం చట్టం ప్రకారం 21 ఏళ్లు దాటిని ప్రతి సిక్కు యువకుడు ఆయా గురుద్వార్ లకు నియమించే పరిపాలన, నిర్వహణ యంత్రాంగాలను(శిరోమణి గురుద్వారా పర్బందక్ కమిటీ-ఎస్జీపీసీ) ఎన్నుకునేందుకు ఓటరుగా నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. అయితే,గతంలో పైన పేర్కొన్న నిబంధనలు ఉండేవి కావు. తర్వాత కాలంలో ఆ కమ్యూనిటీ నుంచి డిమాండ్ ఊపందుకోవడంతో ఈ ఏడాది మార్చి 15న ఈ సవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ సభలో ప్రవేశపెట్టారు. మరుసటి రోజే ఆ బిల్లు ఆమోదం పొందింది. దానికి తాజాగా రాష్ట్రపతి ఆమోదముద్ర వచ్చారు. -
‘వ్యాట్’ సవరణపై సభలో 2 బిల్లులు
సాక్షి, హైదరాబాద్: విలువ ఆధారిత పన్ను(వ్యాట్) సవరణకు సంబంధించి రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదం నిమిత్తం ఏపీ ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో ప్రతి పాదించింది. ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఈ సవరణ బిల్లులను సభలో ప్రతిపాదించారు. ఇది ఇప్పటికే ఆర్డినెన్సుగా అమల్లో ఉంది. హాఏపీ విలువ ఆధారిత పన్ను రెండో సవరణ చట్టం - 2014 ఇది విమాన (వైమానిక టర్బైన్) ఇంధనంపై విలువ ఆధారిత పన్నును 16 నుంచి ఒక శాతానికి తగ్గించేందుకు సంబంధించిన బిల్లు. విమాన ఇంధనంపై వ్యాట్‌ను ఒక శాతంగా అమలు చేస్తూ ప్రభుత్వం గత సెప్టెంబరు 20వ తేదీ ఆర్డినెన్సు తెచ్చింది. అసెంబ్లీ ఆమోదానికి బిల్లును పెట్టారు. హాఏపీ విలువ ఆధారిత పన్ను సవరణ చట్టం - 2014 నెలవారీ వ్యాట్ కింద రిటర్నులు సమర్పించే సమయంలోనే డీలర్లు సరుకుల అమ్మకాలు, కొనుగోలు బిల్లులు కూడా సమర్పించాలని ఈ బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. సరుకులను రవాణా చేసే వాహనంలో ఇన్వాయిస్/ డెలివరీ చలానులతోపాటు వే బిల్లులను కూడా జత చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటరీకరించాలి. దీనివల్ల చెక్‌పోస్టుల్లో ఆన్లైన్ ద్వారా రసీదులు, సరుకులను తేలిగ్గా సరిచూడవచ్చు. పన్ను ఎగవేత, జీరో ట్యాక్స్ కట్టడిలో భాగంగానే ఈ సవరణ బిల్లును ప్రతిపాదించినట్లు ప్రభుత్వం పేర్కొంది.