( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టము 1982ను సవరిస్తూ శనివారం న్యాయశాఖ ప్రభుత్వ కార్యదర్శి వి.సునీత ఆర్డినెన్స్ చేశారు. ఏదైనా విద్యాసంస్ధకు ప్రభుత్వ గ్రాంటును నిలుపుదల చేయడం, తగ్గించడం, ఉపసంహరించుకోవచ్చని ఆర్డినెన్స్ ద్వారా వెల్లడించారు. అలాగే నిర్ణయం తీసుకునే ముందు ఆ సంస్ధ మేనేజరుకు ఒక అవకాశం ఇవ్వాలని విచారణ రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆర్డినెన్స్ ద్వారా సూచించారు. విచారణ సమయంలో కూడా గ్రాంటును నిలుపుదల చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెడుతూ గవర్నర్ పేరుతో ఏపీ న్యాయశాఖ ప్రభుత్వ కార్యదర్శి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment