ఆంధ్రప్రదేశ్ బడ్జెట్... కామెంట్..! | andhra pradesh budget comments | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్... కామెంట్..!

Published Fri, Mar 13 2015 1:38 AM | Last Updated on Tue, Oct 2 2018 6:32 PM

andhra pradesh budget comments

వాణిజ్యం, పరిశ్రమలకు కేటాయించిన నిధులు  సరిపోవు. నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్స్, వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కై స్థల సేకరణ, మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు అవసరమవుతాయి. మొత్తంగా దీర్ఘకాలిక దృష్టితో బడ్జెట్ రూపొందింది.
 -సురేశ్ రాయుడు చిట్టూరి, సీఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్.
 
పన్నులు లేని బడ్జెట్ అని చెబుతున్నారు. రాష్ట్రం ఆర్థిక లోటుతో సతమతమవుతోంది. ఆదుకోవడానికి కేంద్రం ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో కొన్ని రకాల పన్నులు పెంచే అవకాశం ఉంది. స్థూలంగా సమ్మిళిత వృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఆశాజనక బడ్జెట్ ఇది.
- సంగీత రెడ్డి, ఫిక్కీ తెలంగాణ, ఏపీ చైర్‌పర్సన్.
 
పరిశ్రమలకు చేసిన రూ.637 కోట్ల కేటాయింపులు ఏమాత్రం సరిపోవు. పారిశ్రామిక రంగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సింది. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటును వేగవంతం చేయాలి. విద్యుత్‌కు కేటాయింపులు పెరగాలి.
- శివ్‌కుమార్ రుంగ్టా, ఫ్యాప్సీ ప్రెసిడెంట్.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement