
ప్రస్తుత కరోనా కారన ఇబ్బందుల నుంచి వేగంగా బయటపడి దూసుకుపోయే ఛాన్సు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్; బజాజ్ ఫైనాన్స్‌లకు ఉందని ప్రముఖ అనలిస్టు ఆదిత్య ఖెమానీ అభిప్రాయపడ్డారు. ఇలాంటి బలహీన పరిస్థితుల్లో అధిక నాణ్యమైన ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్షియల్స్ నిలదొక్కుకుంటాయన్నారు. అందువల్ల దీర్ఘకాలానికి వీటిని పరిశీలించవచ్చని సూచించారు. షేర్‌మార్కెట్ చరిత్రలో రెండునెలల లాక్‌డౌన్ ఎరగదని, అందువల్ల సమీప భవిష్యత్‌లో ఇవి ఎలా ప్రవర్తిస్తాయో చెప్పలేమని తెలిపారు. లాక్‌డౌన్ వల్ల వాటిల్లిన నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయలేమన్నారు. ఎకానమీతో క్లోజ్‌గా లింకయిన బ్యాంకులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. అన్ని ఫైనాన్షియల్ కంపెనీలు ఒకేలా రికవరీ చూపలేవని, అందువల్ల ఆచితూచి ఎంచుకోవాలని సలహా ఇచ్చారు. చాలా ప్రైవేట్ బ్యాంకుల లాభాలు, విలువ వాటి సబ్సిడరీల నుంచి జమకూడుతుందని, అందువల్ల ఒక ఫైనాన్షియల్ కంపెనీని పరిశీలించేటప్పుడు దాని అనుబంధ సంస్థలను కూడా పరిశీలించాలని సూచించారు. లాక్‌డౌన్ ఎత్తివేసాక, వ్యాపారాలు ఆరంభయితే ఒక్కో రంగం ఎలా స్పందిస్తునేది తెలుస్తుందన్నారు. స్వల్పకాలానికి ఐటీ రంగంలో ఒడిదుడుకులుంటాయని, దీర్ఘకాలానికి ఈ రంగంలోని కంపెనీలు ఒకమోస్తరు లాభాలు ఇస్తాయని ఆయన చెప్పారు.

Comments
Please login to add a commentAdd a comment