అరబిందో ఫార్మాకి యూఎస్ మరో అనుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫంగల్ ఇన్‌ఫెక్షన్ చికిత్సకు వినియోగించే వొరికోనజోల్ జెనరిక్ ట్యాబ్లెట్లను తయారు చేసి విక్రయించడానికి యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతి లభించింది. 50 ఎంజీ, 200 ఎంజీ ట్యాబ్లెట్లను తయారు చేసి విక్రయించడానికి అనుమతులు వచ్చినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. గతేడాది అమెరికాలో ఈ మార్కెట్ పరిమాణం రూ. 700 కోట్లుగా ఉంది.