లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో యాక్సిస్ బ్యాంక్ గ్రీన్ బాండ్లు | Axis Bank launches India's first certified green bond at London Stock Exchange | Sakshi
Sakshi News home page

లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో యాక్సిస్ బ్యాంక్ గ్రీన్ బాండ్లు

Published Tue, Jun 7 2016 1:19 AM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM

లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో యాక్సిస్ బ్యాంక్ గ్రీన్ బాండ్లు

లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో యాక్సిస్ బ్యాంక్ గ్రీన్ బాండ్లు

లండన్:  లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో గ్రీన్ బాండ్ల జారీ ద్వారా ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ 50 కోట్ల డాలర్లు సమీకరించింది. అంతర్జాతీయంగా లిస్టైన తొలి భారత గ్రీన్ బాండ్ ఇది. యాక్సిస్ బ్యాంక్ గ్రీన్ బాండ్‌ను క్లైమెట్ బాండ్స్ స్టాండర్డ్స్ బోర్డ్ సర్టిఫై చేసింది. ఈ గ్రీన్ బాండ్ల ద్వారా సమీకరించిన నిధులను హరిత ఇంధనోత్పత్తి, రవాణా, మౌలిక ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేస్తామని బ్యాంక్ తెలిపింది. 2022 కల్లా 1,75,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి చేయాలన్న భారత ప్రభుత్వ లక్ష్యానికి తోడ్పాటునందిస్తామని  యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ శిఖ శర్మ చెప్పారు. గ్రీన్ బాండ్ల లిస్టింగ్ విషయంలో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ అగ్రస్థానంలో ఉంది.  కాగా 500కోట్డ డాలర్ల మీడియమ్ టర్మ్ నోట్(ఎంటీఎఎన్) ప్రోగ్రామ్ కింద యాక్సిస్ బ్యాంక్ జారీ చేసిన తొలి గ్రీన్ బాండ్ ఇదని శిఖ శర్మ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement