మార్కెట్‌లోకి బజాజ్‌ స్పోర్ట్స్‌ బైక్‌.. ‘డామినర్‌ 400’ | Bajaj's most powerful bike launched at Rs 1.36 lakh | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి బజాజ్‌ స్పోర్ట్స్‌ బైక్‌.. ‘డామినర్‌ 400’

Published Fri, Dec 16 2016 12:47 AM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM

మార్కెట్‌లోకి బజాజ్‌ స్పోర్ట్స్‌ బైక్‌.. ‘డామినర్‌ 400’

మార్కెట్‌లోకి బజాజ్‌ స్పోర్ట్స్‌ బైక్‌.. ‘డామినర్‌ 400’

ప్రారంభ ధర రూ.1.3 లక్షలు   
న్యూఢిల్లీ: మార్కెట్‌ను ఊరిస్తున్న బజాజ్‌ 400సీసీ బైక్‌ రంగప్రవేశం చేసింది. ‘డామినర్‌ 400’ పేరిట బజాజ్‌ ఆటో ఈ కొత్త స్పోర్ట్స్‌ బైక్‌ను గురువారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.1.36 లక్షలు నుంచి రూ.1.5 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) ఉంది. కంపెనీ నుంచి వస్తోన్న అత్యంత శక్తివంతమైన బైక్‌ ఇదే. ‘డామినర్‌ 400’లో 373.2 సీసీ డీటీఎస్‌–ఐ, సింగిల్‌–సిలిండర్, లిక్విడ్‌–కూల్‌డ్, 4–వాల్వ్‌ ఇంజిన్‌ను అమర్చినట్లుకంపెనీ పేర్కొంది. బైక్‌లో స్లిప్పర్‌ క్లచ్‌తో కూడిన 6–స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను పొందుపరిచామని, ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని 8.23 సెకన్లలో అందుకుంటుందని పేర్కొంది. బైక్‌ గరిష్ట వేగం గంటకు 148 కిలోమీటర్లు. నాన్‌–ఏబీఎస్‌ వేరియంట్‌ ధర రూ.1.36 లక్షలుగా, ఏబీఎస్‌ వేరియంట్‌ ధర రూ.1.5 లక్షలుగా ఉందని తెలిపింది.

జనవరిలో డెలివరీ..: రూ.9,000తో బైక్‌ను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చని, జనవరి నుంచి డెలివరీ ఉంటుందని వివరించింది. నెలకు 15,000 యూనిట్ల విక్రయాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
ప్రత్యేక ఫీచర్లివీ...
ఆల్‌ ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్‌
యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌)
ఫుల్‌ డిజిటల్‌ 2 స్టెప్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ట ళీ శక్తివంతమైన ఇంజిన్‌ ళీ స్లిప్పర్‌ క్లచ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement