
న్యూఢిల్లీ: ఒక ప్రాంతం నుంచి మరో చోటకు మారిన వారు బ్యాంకు ఖాతాను తెరిచేందుకు ఇబ్బంది పడకుండా కేవైసీ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులుచేసింది. వలసదారులు సెల్ఫ్ డిక్లరేషన్‌తోనే ఖాతాను తెరిచే విధంగా వెసులుబాటును కల్పించింది. ఆధార్‌తో పనిలేకుండా, స్థానిక చిరునామా కింద నివాస రుజువుగా బ్యాంక్ శాఖలో స్వీయ ప్రకటనను ఇస్తే సరిపోతుందని రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే తెలియజేశారు.