‘భారత్‌ క్యూఆర్‌’ ఆవిష్కరణ | BharatQR code unveiled today: An explainer | Sakshi

‘భారత్‌ క్యూఆర్‌’ ఆవిష్కరణ

Feb 21 2017 12:41 AM | Updated on Sep 5 2017 4:11 AM

‘భారత్‌ క్యూఆర్‌’ ఆవిష్కరణ

‘భారత్‌ క్యూఆర్‌’ ఆవిష్కరణ

క్యాస్‌లెస్‌ ఎకానమీ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రపంచపు తొలి ఇంటర్‌పోర్టబుల్‌ పేమెంట్‌ యాక్సప్టెన్సీ సొల్యూషన్‌ ‘భారత్‌క్యూఆర్‌ కోడ్‌’ను ఆవిష్కరించింది.

రిటైల్‌ ఎలక్ట్రానిక్‌ పేమెంట్స్‌ మరింత సరళం
అమలుకు 15 బ్యాంకులు సిద్ధం

న్యూఢిల్లీ: క్యాస్‌లెస్‌ ఎకానమీ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రపంచపు తొలి ఇంటర్‌పోర్టబుల్‌ పేమెంట్‌ యాక్సప్టెన్సీ సొల్యూషన్‌ ‘భారత్‌క్యూఆర్‌ కోడ్‌’ను ఆవిష్కరించింది. దీంతో రిటైల్‌ ఎలక్ట్రానిక్‌ పేమెంట్స్‌ మరింత సులభతరం కానున్నాయి.  ‘భారత్‌క్యూఆర్‌ కోడ్‌’ విధానంలో వ్యాపారుల ఐడీ, ఫోన్‌ నెంబర్‌ వంటివి అవసరం లేకుండానే లావాదేవీలు నిర్వహించవచ్చు. వ్యాపారులు కేవలం ఒక క్యూఆర్‌ కోడ్‌ను మాత్రమే కలిగి ఉంటారు.

కస్టమర్లు ఆ కోడ్‌ను స్కాన్‌ చేసి అమౌంట్‌ను ఎంటర్‌ చేసి పేమెంట్‌ చేసేయొచ్చు. ఇక్కడ డబ్బులు డైరెక్ట్‌గా మర్చంట్‌ బ్యాంక్‌ ఖాతాకు చేరిపోతాయి. స్వైపింగ్‌ మెసీన్లతో పనిలేదు. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ), మాస్టర్‌కార్డ్, వీసాలు భారత్‌క్యూఆర్‌ కోడ్‌ను అభివృద్ధి చేశాయి. దాదాపు 15 బ్యాంకులు భారత్‌క్యూఆర్‌ కోడ్‌ అమలుకు సిద్ధంగా ఉన్నాయి. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌.గాంధీ ఈ భారత్‌క్యూఆర్‌ కోడ్‌ను ఆవిష్కరించారు.

క్యూఆర్‌ కోడ్‌ అంటే?
క్యూఆర్‌ కోడ్‌నే క్విక్‌ రెస్పాన్స్‌ కోడ్‌ అని పిలుస్తారు. ఇది ఒక టు–డైమెన్షనల్‌ మెషీన్‌ రీడబుల్‌ కోడ్‌. ఇందులో నలుపు, తెలుపు గీతలు ఒక చతురస్రం లో నిక్షిప్తమై ఉంటాయి. ఇందులో యూఆర్‌ఎల్, ప్రొడక్ట్‌ వివరాలు పొందుపరుస్తారు. స్మార్ట్‌ఫోన్‌ కెమెరా ద్వారా వీటిని యాక్సెస్‌ చేయొచ్చు.

దీన్ని ఎలా వాడాలి?
భారత్‌క్యూఆర్‌ కోడ్‌ను ఉపయోగించాలని భావించే వారు స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండాలి. వీరు సంబంధిత బ్యాంక్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. చాలా బ్యాంకులు లెక్కకు మించి యాప్స్‌ను కలిగి ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒకటి మాత్రమే క్యూఆర్‌ కోడ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. దాన్నే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. క్యూఆర్‌ కోడ్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ ఫోన్లలోనే పనిచేస్తుంది.  

‘కార్డు నెట్‌వర్క్స్‌లో రూపే బాగా విజయవంతమయ్యింది. ఇప్పుడు భారత్‌క్యూఆర్‌ కోడ్‌ కూడా ఆ దారిలోనే పయనిస్తుంది’ అని ఎన్‌పీసీఐ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవో ఏపీ హోతా తెలిపారు. తాము ఇప్పటికే మాస్టర్‌పాస్‌ క్యూఆర్‌’ను అభివృద్ధి చేశామని, ఇకపై ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మాస్టర్‌కార్డ్‌ కంట్రీ కార్పొరేట్‌ ఆఫీసర్‌ (ఇండియా), డివిజన్‌ ప్రెసిడెంట్‌ (దక్షిణాసియా) పొరుష్‌ సింగ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement