ముంబై: దేశీ కంపెనీలు కెనడాలో దాదాపు బిలియన్ డాలర్లు (సుమారు రూ. 6,500 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నాయి. తద్వారా 5 వేల ఉద్యోగాలు కల్పించనున్నాయి. భారత పర్యటనలో భాగంగా మంగళవారం దేశీ కార్పొరేట్ దిగ్గజాలతో భేటీ అయిన అనంతరం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ ఈ విషయాలు వెల్లడించారు. భారత కార్పొరేట్లు తమ దేశంలో దాదాపు 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపినట్లు ఆయన తెలియజేశారు.
సహజవనరులు మొదలుకుని ఐటీ, ఫార్మా తదితర అంశాలన్నింటిలోనూ ఇరు దేశాల మధ్య పటిష్టమైన సంబంధాలు ఉన్నాయని కెనడా– ఇండియా బిజినెస్ ఫోరంలో పాల్గొన్న ట్రూడూ తెలిపారు. టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా, మహీంద్రా గ్రూప్ చీఫ్ ఆనంద్ మహీంద్రా, ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పారిఖ్, పల్లోంజీ మిస్త్రీ గ్రూప్ చీఫ్ సైరస్ మిస్త్రీ తదితరులతో ఆయన భేటీ అయ్యారు. అటు ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్, పిరమాల్ గ్రూప్ చీఫ్ స్వాతి పిరమాల్ తదితర మహిళా కార్పొరేట్ దిగ్గజాలతో సుమారు గంటన్నర పాటు రౌండ్‌టేబుల్ సమావేశంలో ట్రూడూ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment