వాటాలు పెంచుకుంటున్న టాటా సన్స్‌ | Block deals in Tata group stocks; shares surge up to 4% | Sakshi
Sakshi News home page

వాటాలు పెంచుకుంటున్న టాటా సన్స్‌

Published Wed, Sep 20 2017 1:00 AM | Last Updated on Wed, Sep 20 2017 11:51 AM

వాటాలు పెంచుకుంటున్న టాటా సన్స్‌

వాటాలు పెంచుకుంటున్న టాటా సన్స్‌

► గ్రూపు కంపెనీల్లో తాజా కొనుగోళ్లు
► టాటా మోటార్స్‌లో 1.7 శాతం..
► టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌లో 4.31%


న్యూఢిల్లీ: టాటా గ్రూపు కంపెనీల్లో మాతృ సంస్థ టాటా సన్స్‌ వాటాలను పెంచుకునే పనిలో పడింది. మంగళవారం ఒక్కరోజే టాటా మోటార్స్, టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌లో వాటాలను కొనుగోలు చేసింది. టాటా మోటార్స్‌లో 1.7%కి సమానమైన షేర్లను  బ్లాక్‌ డీల్‌లో టాటా స్టీల్‌ నుంచి కొనుగోలు చేసింది. ఒక్కో షేరుకు గరిష్టంగా రూ.421.56 చొప్పున చెల్లిం చింది. సోమవారం నాటి క్లోజింగ్‌ ధర కంటే ఇది 4% అధికం. ఇందుకు గాను రూ.2,000 కోట్లు వ్యయం చేసింది. ఈ వార్తతో టాటా మోటార్స్‌ షేరు ధర ఏకంగా 4.6% పెరిగి రూ.423.65 వద్ద క్లోజయింది.

టాటా సన్స్‌ గతేడాది డిసెంబర్‌లోనూ టాటా మోటార్స్‌లో 1.7% వాటాను పెంచుకుంది. అప్పుడు ఒక్కో షేరుకు రూ.486 చొప్పున చెల్లించింది. చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని తొలగించడానికి ఏర్పాటు చేసిన వాటాదారుల భేటీకి ముందు ఈ లావాదేవీ జరిగింది.  కాగా, గ్రూపు కంపెనీలను ఇతర సంస్థలు కొనుగోలు చేసే ముప్పు నుంచి రక్షించుకునేందుకు గాను వాటిల్లో తన వాటాలను పెంచుకోవాలనే లక్ష్యంతో టాటా సన్స్‌ ఉన్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇక, టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌లో 4.31%కి సమానమైన 4,31,75,140 ఈక్విటీ షేర్లను టాటా సన్స్‌ మరో గ్రూపు సంస్థ టాటా కెమికల్స్‌ నుంచి సొంతం చేసుకుంది. ఒక్కో షేరుకు రూ.213.35 చొప్పున చెల్లించగా, ఈ డీల్‌ విలువ రూ.921 కోట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement