
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ తాజాగా తన 3 సిరీస్‌లో షాడో ఎడిషన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది బీఎండబ్ల్యూ 320డీ ఎడిషన్ స్పోర్ట్ షాడో, బీఎండబ్ల్యూ 330ఐ ఎం స్పోర్ట్ షాడో ఎడిషన్ అనే రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది.
వీటి ఎక్స్‌షోరూమ్ ధర వరుసగా రూ.41.4 లక్షలు, రూ.47.3 లక్షలు. కంపెనీ ఈ రెండు వేరియంట్లను చెన్నై ప్లాంటులోనే తయారు చేస్తోంది. బీఎండబ్ల్యూ 320డీ ఎడిషన్ స్పోర్ట్ షాడో వేరియంట్‌లో 2 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ను, బీఎండబ్ల్యూ 330ఐ ఎం స్పోర్ట్ షాడో ఎడిషన్ వేరియంట్‌లో 2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment