హైదరాబాద్‌లో ఎంబ్రార్ ఎంఆర్‌వో కేంద్రం
న్యూఢిల్లీ: విమానాల తయారీలో ఉన్న బ్రెజిల్ దిగ్గజం ఎంబ్రార్.. మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్‌వో) కేంద్రాన్ని హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఎయిరిండియాతో చేతులు కలిపింది.
ఎయిరిండియా ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రం ద్వారా ఆగ్నేయాసియా దేశాల్లో ఎంబ్రార్‌కు చెందిన ప్రైవేట్, బిజినెస్ జెట్స్‌కు ఎంఆర్‌వో సేవలందిస్తారు. 2018 చివరికి ఈ ప్రాంతంలో 40 విమానాలను ఎంబ్రార్ విక్రయించనున్న నేపథ్యంలో మెయింటెనెన్స్ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఎయిరిండియా ఇప్పటికే 6 విమానాశ్రయాల్లో ఎంఆర్‌వో కేంద్రాలను నిర్వహిస్తోంది.