ఈ నెల 23 నుంచి బీఎస్‌ఈ ఐపీఓ
• 25న ముగింపు.. ఆఫర్ ధర గరిష్టంగా రూ.500 !
• వచ్చే నెల 3న ఎన్‌ఎస్‌ఈలో లిస్టింగ్ !
న్యూఢిల్లీ: బాంబే స్టాక్ ఎక్సే్చంజ్(బీఎస్‌ఈ) ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నది. రూ.1,500 కోట్లు సమీకరిస్తుందన్న అంచనాలున్న ఈ ఐపీఓ ఈ నెల 25న ముగుస్తుంది. వచ్చే నెల 3న బీఎస్‌ఈ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌అవుతాయని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా బీఎస్‌ఈలో వాటాలు ఉన్న సంస్థలు 1.54 కోట్ల షేర్లను(దాదాపు 30 శాతం వాటా) ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) విధానంలో విక్రయించనున్నాయి.
ఈ షేర్ ధర గరిష్టంగా రూ.500 ఉండొచ్చని అంచనా. బీఎస్‌ఈలో బజాజ్ హోల్డింగ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్, కాల్డ్‌వెల్‌ఇండియా హోల్డింగ్స్, ఆకేసియా బన్యన్ పార్ట్‌నర్స్, సింగపూర్ ఎక్సే్చంజ్, అమెరికా ఇన్వెస్టర్ జార్జ్ సొరోస్‌కు చెందిన క్వాంటమ ఫండ్, విదేశీ ఫండ అటికస్ తదితర సంస్థలకు వాటాలున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్(ఎంసీఎక్స్).. భారత్‌లో స్టాక్ మార్కెట్లో లిస్టయిన ఏకైక ఎక్సే్చంజ్ ఇదొక్కటే.