BSE IPO
-
బీఎస్ఈ ఐపీఓకు భారీ స్పందన
51 రెట్లు బిడ్స్ న్యూఢిల్లీ: బీఎస్ఈ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు అనూహ్య స్పందన లభించింది. దేశంలో తొలి స్టాక్ ఎక్సే్చంజ్ ఐపీఓ, ఈ ఏడాది తొలి ఐపీఓ కూడా అయిన బీఎస్ఈ ఐపీఓ 51 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయింది. ఐపీఓలో భాగంగా రూ. 2 ముఖవిలువ గల 1.54,27,197(28.26% వాటా) షేర్లను జారీ చేయనున్నారు. యాంకర్ ఇన్వెస్టర్లకు మినహా జారీ చేయనున్న 1,07,99,039 షేర్లకు గాను 55,23,34,986 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. బుధవారం ముగిసిన రూ.805–806 ఇష్యూ ధరగా ఉన్న ఈ రూ.1,243 కోట్ల ఐపీఓకు రూ.44,000 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్(క్విబ్)లకు కేటాయించిన వాటా 49 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 159 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 6 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. డిమోనేటైజేషన్ తర్వాత వచ్చిన తొలి ఐపీఓ ఇది. 11.31 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. సొంత ఎక్సే్చంజ్‌లో లిస్టింగ్‌కు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ అనుమతించనందున మరో దేశీయ స్టాక్ ఎక్సే్చంజ్ ఎన్ఎస్ఈలో బీఎస్ఈ షేర్లు లిస్ట్ కానున్నాయి. గత శుక్రవారం యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు ద్వారా బీఎస్ఈ రూ.373 కోట్లు సమీకరించింది. లిస్టైన కంపెనీల సంఖ్య పరంగా చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్సే్చంజ్ బీఎస్‌ఈనే. త్వరలో ఎన్ఎస్ఈ రూ.10,000 కోట్ల ఐపీఓ రానున్నది. -
బీఎస్ఈ ఐపీఓకు బంపర్ డిమాండ్
ముంబై : మొదటిసారి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)కు వచ్చిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు బంపర్ డిమాండ్ వచ్చింది. మూడు రోజుల బిడ్డింగ్ల్లో ఆఖరి రోజు బుధవారం బీఎస్ఈ 51.01 సార్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది. 1,07,99,039 షేర్లను ఇది ఆఫర్ చేస్తే, పబ్లిక్ ఆఫర్ కింద దీనికి 55,08,50,616 షేర్ల బిడ్స్ దాఖలయ్యాయి. రూ. 1,243 కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో, రూ..805–806 ధరల శ్రేణిలో బీఎస్ఈ పబ్లిక్ ఆఫర్‌కు వచ్చింది. ఒక దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఐపీఓకు రావడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది వస్తున్న తొలి ఐపీఓ కూడా ఇదే. రిటైల్ సెగ్మెంట్ నుంచి దీనికి మంచి డిమాండ్ వచ్చింది. ఈ సెగ్మెంట్లో వ్యక్తిగత పెట్టుబడిదారులు 3,31,94,448 షేర్ల బిడ్స్ దాఖలు చేశారు. ఆసియాలో పురాతనమైన ఎక్స్చేంజ్ అయిన బీఎస్ఈ 1875 జూలై 9న ఏర్పాటైంది. 2016 జూలై 30కు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్చేంజ్ల్లో ఒకటిగా నిలిచింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఇది ప్రపంచంలో 11వ అతిపెద్ద ఎక్స్చేంజ్. లిస్టెడ్ కంపెనీలతో దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.52 ట్రిలియన్ డాలర్లు. -
నేటి నుంచే బీఎస్ఈ ఐపీఓ
• 25న ముగింపు • ఇష్యూ ధర రూ.805–806 న్యూఢిల్లీ: బాంబే స్టాక్ ఎక్సే్ఛంజ్(బీఎస్ఈ) ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ ఐపీఓ ద్వారా బీఎస్ఈ రూ.1,243 కోట్లు సమీకరించనున్నది. ఒక దేశీయ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఐపీఓకు రావడం ఇదే మొదటిసారి.ఈ ఏడాది వస్తున్న తొలి ఐపీఓ కూడా ఇదే. రూ.805–806 ధరల శ్రేణి ఉన్న ఈ ఐపీఓ ఈ నెల 25(బుధవారం) ముగియనున్నది. ఈ ఐపీఓలో భాగంగా రూ.2 ముఖ విలువ గల 1.54 కోట్ల షేర్లను(28.26 శాతం వాటా) ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో ఆఫర్ చేయనున్నారు. కనీసం 18 షేర్లకు, ఆ తర్వాత 18 గుణిజాల్ల చొప్పున షేర్లకు బిడ్లు దాఖలు చేయాలి. సెల్ఫ్ లిస్టింగ్‌కు సెబీ నిబంధనలు అనుమతించని కారణంగా బీఎస్ఈ షేర్లు ఎన్ఎస్ఈలోనే లిస్ట్ అవుతాయి. యాంకర్ ఇన్వెస్టర్లకు 46 లక్షల షేర్లను ఒక్కోటి రూ.806 చొప్పున కేటాయించి బీఎస్ఈ ఇప్పటికే రూ.373 కోట్లు సమీకరించింది. ఈ దృష్ట్యా ఈ ఐపీఓకు మంచి స్పందన లభించే అవకాశాలున్నాయని నిపుణుల అంచనా. ఆసియాలో పురాతనమైన ఎక్సే్ఛంజ్.. ఆసియా దేశాల్లో అత్యంత పురాతనమైన ఎక్సే్ఛంజ్అయిన బీఎస్ఈలో ప్రస్తుతం బజాజ్ హోల్డింగ్స్ ఇన్వెస్ట్మెంట్, కాల్డ్వెల్ ఇండియా హోల్డింగ్స్, అకేసియా బన్యన్ పార్ట్నర్స్, సింగపూర్ ఎక్సే్ఛంజ్, అమెరికా ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్‌కు చెందిన మారిషస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే క్వాంటమ్ ఫండ్, డాషే బోర్సే, ఎస్బీఐ, ఎల్ఐసీ, జీకేఎఫ్ఎఫ్ వెంచర్స్, తదితర సంస్థలకు వాటాలున్నాయి. బీఎస్ఈలో ప్రారంభంలో సుమారుగా 9,000 మంది వాటాదారులున్నారని అంచనా. వీరిలో అధికులు స్టాక్ బ్రోకర్లే. కాలక్రమంలో విదేశీ, దేశీ ఇన్వెస్టర్లు ఈ బ్రోకర్ల నుంచి ఈ వాటాలను కొనుగోలు చేశారు. లిస్టైన కంపెనీల సంఖ్య పరంగా చూస్తే బీఎస్‌ఈనే ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టాక్ ఎక్సే్చంజ్. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చూస్తే భారత్‌లో అతి పెద్దది, ప్రపంచంలో పదవది. బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,10,23,189 కోట్లుగా ఉంది. బీఎస్ఈలో 5,911 కంపెనీలు లిస్ట్ అయ్యాయి. ఇక భారత్‌లో స్టాక్ మార్కెట్లో లిస్టయిన ఎకైక ఎక్సే్ఛంజ్.. ఎంసీఎక్స్(మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్). కాగా రూ.10 వేల కోట్ల సమీకరణ నిమిత్తం ఎన్ఎస్ఈ ఐపీఓ పత్రాలను సెబీకి దాఖలు చేసింది. -
ఈ నెల 23 నుంచి బీఎస్ఈ ఐపీఓ
• 25న ముగింపు.. ఆఫర్ ధర గరిష్టంగా రూ.500 ! • వచ్చే నెల 3న ఎన్ఎస్ఈలో లిస్టింగ్ ! న్యూఢిల్లీ: బాంబే స్టాక్ ఎక్సే్చంజ్(బీఎస్ఈ) ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నది. రూ.1,500 కోట్లు సమీకరిస్తుందన్న అంచనాలున్న ఈ ఐపీఓ ఈ నెల 25న ముగుస్తుంది. వచ్చే నెల 3న బీఎస్ఈ షేర్లు ఎన్ఎస్ఈలో లిస్ట్అవుతాయని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా బీఎస్ఈలో వాటాలు ఉన్న సంస్థలు 1.54 కోట్ల షేర్లను(దాదాపు 30 శాతం వాటా) ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నాయి. ఈ షేర్ ధర గరిష్టంగా రూ.500 ఉండొచ్చని అంచనా. బీఎస్ఈలో బజాజ్ హోల్డింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్, కాల్డ్వెల్ఇండియా హోల్డింగ్స్, ఆకేసియా బన్యన్ పార్ట్నర్స్, సింగపూర్ ఎక్సే్చంజ్, అమెరికా ఇన్వెస్టర్ జార్జ్ సొరోస్‌కు చెందిన క్వాంటమ ఫండ్, విదేశీ ఫండ అటికస్ తదితర సంస్థలకు వాటాలున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్(ఎంసీఎక్స్).. భారత్‌లో స్టాక్ మార్కెట్లో లిస్టయిన ఏకైక ఎక్సే్చంజ్ ఇదొక్కటే. -
బీఎస్ఈ ఐపీఓకు వాటాదారులు ఓకే
♦ కనీసం 30% వాటా విక్రయం ! ♦ ఓఎఫ్ఎస్ విధానంలో ఐపీఓ ముంబై: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)కు వాటాదారుల ఆమోదం లభించింది. గత వారంలో జరిగిన కంపెనీ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో బీఎస్ఈ ఐపీఓకు వాటాదారులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని బీఎస్ఈ వెల్లడించింది. ఈ ఐపీఓ ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో ఉండొచ్చని, వాటాదారులు కూడా దానికే ఓటు వేశారని సమాచారం. బీఎస్ఈలో గరిష్టంగా 30 శాతం ఈక్విటీని ఓఎఫ్ఎస్ విధానంలో విక్రయించనున్నారు. ఇప్పటివరకూ బీఎస్ఈలో బ్రోకర్లు, వివిధ సంస్థలతో కలసి మొత్తం 9,283 మంది వాటాదారులున్నారు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి బీఎస్ఈకి ఈ ఏడాది మొదట్లోనే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. త్వరలోనే ఐపీఓ ముసాయిదా పత్రాలను సెబీకి బీఎస్ఈ సమర్పించనున్నది. ఈ ఐపీఓకు లీడ్ మర్చంట్ బ్యాంకర్‌గా ఎడిల్‌వేజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను , న్యాయ సలహాదారులుగా ఏజెడ్‌బీ అండ్ పార్ట్నర్స్, నిశిత్ దేశాయ్ అసోసియేట్స్‌ను బీఎస్ఈ నియమించింది. మరో స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ... దేశీయంగానూ, విదేశాల్లోనూ లిస్టింగ్‌కు ప్రయత్నాలు చేయనున్నామని ఇటీవలనే వెల్లడించింది. -
6 నెలల్లోగా బీఎస్ఈ పబ్లిక్ ఇష్యూ
కోల్‌కతా: ఆసియాలోనే అతి పురాతనమైన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ వచ్చే ఆరు నెలల్లోగా స్టాక్ మార్కెట్లో నమోదు కానుంది. వాటాల ఉపసంహరణకు సంబంధించి అనుమతి కోరుతూ ఇప్పటికే సెబీకి దాఖలు చేశామని, అనుమతులు రాగానే పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు బీఎస్ఈ మేనేజింగ్ డెరైక్టర్ అండ్ సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇష్యూ పరిమాణం చెప్పలేమని, అది రూ.400 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు ఉండొచ్చన్నారు. సెబీ నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు వచ్చిన తర్వాతనే ఈ ఇష్యూపై స్పష్టత వస్తుందన్నారు. బీఎస్ఈలో 7,000 మందికిపైగా వాటాదారులు ఉన్నారు. అందులో 40 శాతం బ్రోకింగ్ కమ్యూనిటీకి సంబంధించినవాళ్లు ఉండగా, మరో 30 శాతం విదేశీ సంస్థలు ఉన్నాయి. షేర్లను వేలం వేయడం ద్వారా (ఆఫర్ ఫర్ సేల్) వాటాలను విక్రయించాలని బీఎస్ఈ నిర్ణయించింది. ఇందుకోసం గత జనవరిలో సెబీకి దరఖాస్తు చేసింది.