సాక్షి, న్యూఢిల్లీ : బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వేతన, పెన్షన్ సవరణలతో పాటు వారి ప్రధాన డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలకు అనుకూలంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాశామని టెలికమ్యూనికేషన్ల మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నామని మంత్రి చెప్పారు.
కాగా, బీఎస్‌ఎన్‌ఎల్‌లో ప్రస్తుత ఉద్యోగుల వేతన సవరణతో ముడిపెట్టకుండా తమకు వేరుగా పెన్షన్ సవరణ చేపట్టాలన్నరిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్‌కు టెలికాం మంత్రిత్వ శాఖ అంగీకరించిందని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో 15 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణకు మార్గం సుగమం కానుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌కు మార్కెట్ వాటా బలోపేతం కోసం సంస్థకు 4జీ స్పెక్ర్టమ్ కేటాయించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈ డిమాండ్‌ను నొక్కిచెబుతూ నిరవధిక సమ్మెకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు కోరుతూ టెలికాం శాఖ కేబినెట్ నోట్‌ను సిద్ధం చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment