బ్యాంకులపై పెరగనున్న ఎన్పీఏల ఒత్తిడి | China's toxic debt pile may be 10X official estimates: Fitch | Sakshi
Sakshi News home page

బ్యాంకులపై పెరగనున్న ఎన్పీఏల ఒత్తిడి

Published Fri, Dec 9 2016 12:33 AM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM

బ్యాంకులపై పెరగనున్న ఎన్పీఏల ఒత్తిడి - Sakshi

బ్యాంకులపై పెరగనున్న ఎన్పీఏల ఒత్తిడి

భారత్ అలాగే చైనా బ్యాంకులపై మొండిబకారుుల (ఎన్‌పీఏ) ఒత్తిడి 2017లో పెరుగుతుందని రేటింగ్ సంస్థ ఫిచ్ తన తాజా నివేదికలో అంచనావేసింది.

రేటింగ్ ఏజెన్సీ ‘ఫిచ్’ అంచనా
చైనాలోనూ ఇదే తీరని అభిప్రాయం

 ముంబై: భారత్ అలాగే చైనా బ్యాంకులపై మొండిబకారుుల (ఎన్‌పీఏ) ఒత్తిడి 2017లో పెరుగుతుందని రేటింగ్ సంస్థ ఫిచ్ తన తాజా నివేదికలో అంచనావేసింది. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి తగిన ఆదాయాలు, మూలధనం ఉన్నప్పటికీ ఎన్‌పీఏల సమస్య బ్యాంకింగ్‌కు తప్పదని అంచనావేసింది. ఆయా పరిస్థితులు ఆర్థికంగానూ భారత్, చైనా ఆర్థిక వ్యవస్థలకు కొంత ఇబ్బందికరమైన అంశాలేనని పేర్కొంది.  ఈ మేరకు ఆసియా-పసిఫిక్ ప్రాంత దేశాల బ్యాంక్‌లకు సంబంధించి 2017 అవుట్‌లుక్‌ను ఫిచ్ విడుదల చేసింది.

పలు దేశాల్లో అటు కంపెనీల పరంగా, ఇటు గృహ అవసరాల పరంగా రుణ భారాలు 2009 నుంచీ పెరుగుతూ వస్తున్నాయని, ఇది 2017లో కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని నివేదిక వివరించింది. ఆసియా వర్థమాన మార్కెట్‌లో ఆర్థిక వృద్ధి 2017లో 6.4 శాతంగా ఉంటుందని సంస్థ అభిప్రాయపడింది. ఇతర ప్రాంత దేశాలతో పోల్చితే ఈ వృద్ధి రేటు అధికమైనప్పటికీ, 2010-14 సగటు 7.8 శాతం కన్నా ఇది తక్కువన్న విషయం గమనార్హమని పేర్కొంది.

 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం నేపథ్యంలో డాలర్ బలోపేతం కావడం- డాలర్ డినామినేటెడ్ రుణ చెల్లింపులకు సంబంధించి బ్యాంకింగ్‌కు భారంగా మారుతున్న అంశమని నివేదిక పేర్కొంది. ట్రంప్ ప్రతిపాదిస్తున్న రక్షణాత్మక విధానాలు ప్రపంచ వాణిజ్యంపై ప్రత్యేకించి వర్థమాన ఆసియా ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూలత చూపే వీలుందని నివేదిక అంచనావేసింది.  ఆయా అంశాలూ బ్యాంకింగ్ రుణ నాణ్యతపై ప్రభావం చూపే అంశాలేనని విశ్లేషించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement