
నార్త్ అమెరికాలో బ్రాండెడ్ జనరిక్స్: డాక్టర్ రెడ్డీస్
హైదరాబాద్: కాంప్లెక్స్ జనరిక్స్, నూతన ప్రొప్రైటరీ ఉత్పత్తులు రానున్న రోజుల్లో కంపెనీ వృద్ధికి బాటలు పరుస్తాయని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తెలిపింది. ఉత్తర అమెరికా మార్కెట్లో బ్రాండెడ్ జనరిక్స్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. రష్యా, సీఐఎస్‌తోపాటు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో బయాలాజిక్స్ విభాగాన్ని విస్తృతం చేయనున్నట్టు కంపెనీ చైర్మన్ కె.సతీష్ రెడ్డి కంపెనీ వార్షిక నివేదికలో తెలిపారు.