
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ సేవల్లో ఉన్న సింగపూర్‌కు చెందిన డీబీఎస్ భారత్‌లో విస్తరిస్తోంది. ప్రస్తుతం సంస్థకు శాఖలు, కియోస్క్‌లు 70 దాకా ఉన్నాయి. ఏడాదిలోగా ఈ సంఖ్య 100కు చేరుతుందని డీబీఎస్ బ్యాంక్ ఇండియా బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ ప్రియాశిష్ దాస్ తెలిపారు. వైస్ ప్రెసిడెంట్, బ్రాంచ్ హెడ్ కె.శ్రీనివాస రావుతో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 25 నగరాల్లో సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. ఆరవ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను త్వరలో హైదరాబాద్‌లోని వేవ్‌రాక్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. భాగ్యనగరిలో 40 వేల పైచిలుకు కస్టమర్లున్నారని వివరించారు. బ్యాంకు ఉద్యోగుల సంఖ్య 2,000లకు పైగా ఉంది. పూర్తిగా కాగిత రహిత విధానాన్ని అనుసరిస్తున్నట్టు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment