
రూ. 54 వేలకు తలసరి రుణభారం
ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి తలసరి రుణభారం రూ. 53,796కి చేరింది. కేంద్ర ప్రభుత్వ రుణం ప్రాతిపదికన లెక్కించిన ఈ భారం..
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి తలసరి రుణభారం రూ. 53,796కి చేరింది. కేంద్ర ప్రభుత్వ రుణం ప్రాతిపదికన లెక్కించిన ఈ భారం.. 2015 మార్చి ఆఖరు నాటి గణాంకాలతో పోలిస్తే 9 శాతం ఎగబాకింది.అధిక జీడీపీ వృద్ధి సాధన దిశగా అభివృద్ధి కార్యకలాపాలపై వ్యయాలు పెరగడం ఇందుకు కారణం. 2010 మార్చి నాటికి రూ. 30,171గా ఉన్న తలసరి రుణ భారం 2015 మార్చి ఆఖరు నాటికి రూ. 49,270కి పెరిగింది.మొత్తం రుణంపై 2015–16లో రూ. 4,41,659 కోట్ల వడ్డీ చెల్లించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభకు తెలిపారు.