న్యూఢిల్లీ : కొనుగోలుదారులకు సరియైన సమయంలో ఫ్లాట్లను అందజేయకుండా చేతులెత్తేసిన జేపీ అసోసియేట్స్‌కు మరోసారి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. తాము అంతకముందు ఆదేశించిన రూ.125 కోట్లను డిపాజిట్ చేయాలని, లేదా కోర్టు ధిక్కార కేసు కింద తిహార్ జైలుకి పంపించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. తిహార్ జైలు ఎంతో దూరంలో లేదంటూ కూడా వ్యాఖ్యానించింది. జేపీ ఇన్‌ఫ్రాటెక్ ఇళ్లు కొనుగోలుదారులు తమ నగదును రీఫండ్ కోరడంతో, రూ.2000కోట్లను జేపీ అసోసియేట్స్ తమ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
ఆ రూ.2000 కోట్లలో భాగమే రూ.125 కోట్లు. జనవరి 25 వరకు ఈ రూ.125 కోట్లను డిపాజిట్ చేయాలని జేపీ అసోసియేట్స్‌కు తెలిపింది. ఈ గ్రూప్ నిర్మిస్తున్న అన్ని హౌజింగ్ ప్రాజెక్ట్‌ల జాబితాతో జేపీ అసోసియేట్స్ అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా టాప్ కోర్టు బెంచ్ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్‌విల్‌కర్, జస్టిస్ డీవై చంద్రచుద్ ఆదేశించారు. దివాలా చట్టం కింద జేపీ అసోసియేట్స్‌పై చర్యలు తీసుకోవడానికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ఆమోదాన్ని కోరుతోది. కానీ దివాలా చట్టం ప్రయోగిస్తే కొనుగోలుదారులు నష్టపోవాల్సి వస్తుందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment