
సాక్షి, న్యూఢిల్లీ : నేడు దేశవ్యాప్తంగా ధన్‌తెరాస్ శోభ వెల్లివిరుస్తోంది. దీపావళికి ఒక్కరోజు ముందుగా వచ్చే ఈ ఫెస్టివల్‌కు ఏదైనా సరికొత్త వస్తువులను కొనుగోలుచేయాలని వినియోగదారులు ఆసక్తి కనబరుస్తుంటారు. ముఖ్యంగా ఈ పర్వదినాన బంగారానికి బహు గిరాకి. బంగారానికి ఉన్న గిరాకితో జువెలర్స్ కూడా సరికొత్త కలెక్షన్స్‌తో కనువిందు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలు ఈ-కామర్స్ సైట్లు, జువెల్లరీ బ్రాండ్లు ధన్‌తెరాస్ సందర్భంగా ఆకట్టుకునే డిస్కౌంట్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ధన్‌తెరాస్ 2017: రూపాయికే బంగారమంటూ పేటీఎం, అమెజాన్, జువెల్లర్స్ ఆకర్షణీయమైన డిస్కౌంట్లను తెరతీశాయి.
రూపాయికే బంగారం కొనుగోలు : పేటీఎం గోల్డ్ 'దివాళి గోల్డ్ సేల్' సందర్భంగా ఈ ఫెస్టివ్ సీజన్‌లో కనీసం రూ.10వేల మొత్తంలో కొనుగోలు చేపడితే అదనంగా 3 శాతం బంగారం అందించనున్నారు. ఒకవేళ రూ.10వేల కంటే తక్కువ మొత్తంలో చేపడితే 2 శాతం బంగారం ఆఫర్ చేస్తోంది. గోల్డ్‌ఫెస్ట్ అనే ప్రోమోకోడ్‌ను వాడి ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. అంతేకాక పేటీఎం గోల్డ్‌లో రూ.1కే ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పించింది.
అమెజాన్ గోల్డ్ కాయిన్లు : గోల్డ్ కాయిన్లపై అమెజాన్ 10 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తోంది. జోయలుక్కాస్, మలబార్, సెన్కో గోల్డ్, బ్లూస్టోన్, పీఎన్ డాడ్గిల్ జువెల్లర్స్, ఎంఎంటీసీ-పీఏఎంపీ వంటి దిగ్గజ బ్రాండ్లపై అమెజాన్ డిస్కౌంట్లను అందిస్తోంది. 1 నుంచి 50 గ్రాముల స్వచ్ఛత కలిగిన 22 క్యారెట్ల నుంచి 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్లను అమెజాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
చాలా మంది జువెల్లర్స్ కొనుగోలుదారులకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. తనిష్క్, మియా ద్వారా ఆభరణాలు కొనుగోలు చేస్తే హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై 5 శాతం, మలబార్ గోల్డ్, డైమండ్స్ నుంచి కనీసం రూ.25వేలకు కొనుగోలుచేపడితే ఎస్‌బీఐ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను జువెల్లర్స్ ఆఫర్ చేస్తున్నారు. స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్లు బంగారం, సిల్వర్ జువెల్లరీపై స్పెషల్ ఆఫర్లను తెరతీశాయి. గోల్డ్ బార్లపై స్నాప్‌డీల్ 10 శాతం వరకు, గోల్డ్ కాయిన్లపై 25 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment