న్యూఢిల్లీ: ‘ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్’ (ఈపీఎఫ్‌వో) ఈఏడాది అక్టోబర్ నాటికి రూ.2,322 కోట్లను ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో ఇన్వెస్ట్ చేసింది. ఈపీఎఫ్‌వో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కోట్లను ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈపీఎఫ్‌వో ఆగస్ట్-అక్టోబర్ మధ్య కాలంలో ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా రూ.2,322 కోట్లను క్యాపిటల్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టింది. సెన్సెక్స్ షేర్లలో రూ.588 కోట్లను, నిఫ్టీ షేర్లలో రూ.1,734 కోట్లను ఇన్వెస్ట్ చేసింది.