పెట్రోల్, డీజిల్‌పై 50 శాతం పెరిగిన ఎక్సైజ్ వసూళ్లు
న్యూఢిల్లీ: పెట్రోల్, డిజిల్‌పై ఎక్సైజ్ సుంకాల వసూళ్లు గడచిన ఆర్థిక సంవత్సరం (2014-15)లో 50 శాతం పెరిగాయి. 2014-15లో ఈ సుంకాల వసూళ్ల మొత్తం రూ.74.5 కోట్లని లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. వేర్వేరుగా పెట్రోల్ విషయంలో ఈ మొత్తం రూ.22,424 కోట్ల నుంచి రూ.31,165 కోట్లకు ఎగసింది. డీజిల్‌కు సంబంధించి సుంకాల వసూళ్లు రూ. భారీగా రూ.27,146 కోట్ల నుంచి రూ.43,300 కోట్లకు పెరిగింది. ఆదాయాలను పెంచుకోవడంలో లక్ష్యంగా కేంద్రం పలు దఫాలు సుంకాలు పెంచడం దీనికి ప్రధాన కారణం.