
'ఫ్రెండ్స్' బుక్ కు సరికొత్త యాప్
యువతను ఎక్కువగా ఆకట్టుకున్న ఫేస్ బుక్ సరికొత్త ఆవిష్కరణలతో మన ముందుకు వస్తోంది. ఇప్పటివరకూ ఫేస్ బుక్ లో ఉన్న స్నేహితులతోనే చాటింగ్ సౌకర్యం కల్పించిన మెసెంజర్ యాప్ ను మరికొన్ని సేవలను అందిస్తోంది. కొత్త స్నేహితులను కూడా మెసెంజర్ యాప్ లోనే వెతుకునే వెసులుబాటు కల్పిస్తోంది. దీని కోసం ఓ ప్రత్యేక కోడ్ ను ఫేస్ బుక్ అందిస్తోంది.
ఈ కోడ్ ద్వారా ఫేస్ బుక్ కాంటాక్ట్ లేని స్నేహితులు మీతో చాట్ చేసుకునే సౌకర్యం కలుగుతోంది. మెసెంజర్ కోడ్ ద్వారా ఎవరితోనైతే మనం చాట్ చేయాలనుకుంటామో వారికి మొదట రిక్వెస్ట్ పంపించాల్సి ఉంటుంది. అలా రిక్వెస్ట్ పంపినప్పుడు వారికి ఫేస్ బుక్ యూజర్ ప్రొఫెల్ ఫోటో కనిపించి, తేలికగా గుర్తించే వెసులు బాటు ఉంటుంది. ఈ మెసెంజర్ కోడ్ వల్ల ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి కూడా తప్పించుకోవచ్చని ఫేస్ బుక్ తెలిపింది. మెసెంజర్ కోడ్ ను ఈ నెల 7 నుంచి ఫేస్ బుక్ యూజర్స్ కు అందుబాటులోకి వచ్చింది. నెలకు 900 మిలియన్ల మంది యాక్టివ్ లో ఉండే ఈ ఫేస్ బుక్ యూజర్లు ప్రత్యేక కోడ్ ద్వారా కొత్త కాంటాక్ట్ లను వెతుకుతున్నట్టు కంపెనీ వెల్లడించింది.