ఆర్థిక సర్వీసుల కార్యదర్శి అంజలి చిబ్ దుగ్గల్
న్యూఢిల్లీ: బ్యాంకుల మొండి బకాయిల భారం ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆర్థిక సర్వీసుల కార్యదర్శి అంజలి చిబ్ దుగ్గల్ తెలిపారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా సారథ్యం వహించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో ఆర్థిక మంత్రి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు వివరించారు.
జూన్ ఆఖరు నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 6.03 శాతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. మార్చి ఆఖరు నాటికి ఇవి 5.20 శాతం స్థాయిలో ఉన్నాయి. ఎన్‌పీఏలు ఎక్కువగా ఉన్న ఉక్కు, అల్యూమినియం, టెక్స్‌టైల్ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోందని దుగ్గల్ వివరించారు.
ప్రధానమంత్రి ‘జన ధన్’ యోజనకి మంచి స్పందన వచ్చిందని, ఈ పథకం కింద డిపాజిట్లు రూ. 27,000 కోట్ల పైగా వచ్చాయని ఆమె తెలిపారు. జీరో బ్యాలెన్స్ ఖాతాల సంఖ్య 35 శాతానికి తగ్గిందన్నారు. మరోవైపు, ఎన్‌పీఏలు పెరిగిపోవడానికి పలు కారణాలు ఉన్నాయని సిన్హా చెప్పారు.
మొండిబకాయిల పరిష్కారానికి కమిటీ
Published Sat, Nov 28 2015 12:45 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
Advertisement