ఫినో మనీ మార్ట్‌లో వచ్చే ఆరునెలల్లో బ్యాంకింగ్ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని ఫినో పే టెక్ లిమిటెడ్ జోనల్ హెడ్ అజయ్ పరిహార్ పేర్కొన్నారు
ఫినో పే టెక్ జోనల్ హెడ్ అజయ్ పరిహార్
సాక్షి, హైదరాబాద్: ఫినో మనీ మార్ట్‌లో వచ్చే ఆరునెలల్లో బ్యాంకింగ్ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని ఫినో పే టెక్ లిమిటెడ్ జోనల్ హెడ్ అజయ్ పరిహార్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఫినో మనీ మార్ట్ కార్యాలయాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అజయ్ పరిహార్ మాట్లాడుతూ సంస్థ ద్వారా హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న ఔట్ లెట్లలో ఈ బ్యాంకింగ్ సేవలను అందుబాటులో తేవడానికి రిజర్వుబ్యాంక్ అనుమతి పోందడం జరిగిందన్నారు.
ఇటీవల ఫినో మనీకి పేమెంట్ బ్యాంకు లెసైన్సు లభించిన సంగతి తెలిసిందే. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి 500 దాకా ఫినో మనీ ఫ్రాంచైజీలు పనిచేస్తుండగా, హైదరాబాద్ నగరంలో 17 ఔట్‌లెట్లను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా విద్యుత్, మున్సిపల్, మొబైల్ బిల్లులు ఎల్‌ఐసీ ప్రీమియంలు చెల్లించడానికి, బస్సు, రైలు, విమాన టికెట్లను పొందడానికి, ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.
నగరంలోని ఔట్‌లెట్ల ద్వారా ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వినియోగదారులు మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. ఎలాంటి బ్యాంక్ అకౌంట్ లేకపోయినా వివిధ ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన వారు తమ కుటుంబసభ్యులు, స్నేహితులు, ఇతరుల బ్యాంక్ అకౌంట్లలోకి నగదును పంపించడానికి అవకాశం కల్పిస్తున్నా మన్నారు.