
15 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు పచ్చజెండా
న్యూఢిల్లీ: ప్రభుత్వం 15 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటి విలువ రూ.12,000 కోట్లు. ఆమోదం పొందిన వాటిల్లో డాక్టర్ రెడ్డీస్, అపోలో హాస్పిటల్స్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్, వొడాఫోన్, తదితర సంస్థల ఎఫ్‌డీఐ ప్రతిపాదనలు ఉన్నాయి.