భారతీయ షేర్లలో విదేశీ ఇన్వెస్టర్ల వాటా ఆరున్నరేళ్ల కనిష్టానికి చేరుకుంది. భారత్‌లో మందగమన భయాలతో సెంటిమెంట్ బలహీనపడటం ఇందుకు కారణమైంది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి భారత్‌లో టాప్ 500 కంపెనీల్లో విదేశీ ఇన్వెస్టర్ల హోల్డింగ్స్ 20శాతం పడిపోయాయి. 2013 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం నుంచి ఇదే అత్యల్ప హోల్డింగ్ అని క్రిడెట్ సూసీ నివేదికలు తెలిపాయి.
ఇదే మార్చి కార్వర్ట్ ముగింపు నాటికి బీఎస్‌ఈలో 500 కంపెనీల్లో ప్రమోటర్ల వాటా రికార్డు స్థాయిలో 44శాతానికి పెరిగింది. అయితే ప్రభుత్వ వాటా మాత్రం జీవితకాల కనిష్ట స్థాయి 6.6శాతానికి పతనమైంది. దేశీయ సంస్థాగత, రిటైలర్ల వాటాలో ఎలాంటి మార్పు లేకుండా 14శాతంగా ఉంది.
నిఫ్టీ-50 కంపెనీల్లో ఎఫ్‌ఐఐల వాటా 24శాతం ఉంది. బీఎస్‌ఈ 500 కంపెనీల్లో(నిఫ్టీ-50 షేర్లను మినహాయిస్తే) ఎఫ్‌ఐఐల వాటా 13శాతంగా ఉంది. డీఐఐ ప్రవాహాలు మందగించడం ఎఫ్‌ఐఐ ప్రవాహాలపై స్వల్పకాలిక పనితీరు ఆధారపడటాన్ని పెంచుతుందని క్రెడిట్ సూసీ లోని ఇండియా ఈక్విటీ స్ట్రాటజిస్ట్ నీల్కాంత్ మిశ్రా అన్నారు.
ఎఫ్‌ఐఐలు మార్చిలో రూ.58,600 కోట్ల ఈక్విటీ షేర్లను, ఏప్రిల్‌లో రూ.4100 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించారు. మేలో ఇప్పటికీ వరకు రూ.5200 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోళ్లు చేశాయి. అయితే హెచ్‌యూఎల్ షేర్లను జీఎస్‌కే బ్లాక్ సేల్ రూపంలో ఇన్వెసర్లకు విక్రయించకుంటే ఈ గణాంకాలు నెగిటివ్‌లో ఉండేవి.
‘‘ఎఫ్‌ఐఐలు తన వైఖరీ మార్చుకునేందుకు వరకు భారతీయ మార్కెట్ ప్రదర్శన ప్రతికూలంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ను ఎత్తివేసి ఆర్థిక పునరుద్ధరణ ప్రారంభమైనపుడే అది సాధ్యమవుతుంది. అయితే కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉండటంతో ఆర్థిక పునరుద్ధరణ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి మధ్య నుంచి మార్చి చివరి వరకు ఎఫ్‌పీపీలు అతిపెద్ద అమ్మకందారులుగా ఉన్నారు. ఇది రానున్న రోజుల్లో కంపెనీల్లో వాటా తగ్గడానికి దారితీస్తుందని’’ మోతీలాల్ ఓస్వాల్ ఈక్విటీస్ సీఈవో రాజత్ రాజ్‌గారియా తెలిపారు.
భారత ప్రధాని మోదీ మే 12న రూ.2లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. నిర్ధిష్టమైన విధి విధానాలు లేకపోవడం, కేటాయింపు రంగాలకు తక్షణ ఉపశమన కలగకపోవడం తదితర కారణాలతో ప్యాకేజీ మార్కెట్‌ను మెప్పించకలేకపోయింది. దీంతో ఇదే రోజు ఎఫ్‌పీఐలు రూ.11564 కోట్ల విలువైన భారతీయ స్టాక్‌లను విక్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment