నిఫ్టీ ఇండెక్స్‌కు తదుపరి కీలక నిరోధం 10,450-10,500 శ్రేణిలో ఉండొచ్చని సామ్‌కో సెక్యూరిటీస్ హెడ్ రీసెర్చ్ ఉమేష్ మెహతా అంచనా వేస్తున్నారు. 61శాతం ఫిబోనకి రిట్రేస్‌మెంట్ స్థాయిలు ఇండెక్స్‌ను 10,450-10,500 స్థాయిలకు తీసుకెళ్లవచ్చని, ఈ తర్వాత కరెక‌్షన్ జరగవచ్చని ఆయన అంటున్నారు. ఒకవేళనిఫ్టీకి 10200 స్థాయిలో ఒత్తిడి ఏర్పడితే కరెక‌్షన్ ముందుగానే ఏర్పడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అధిక వ్యాల్యూయేషన్ కలిగిన షేర్లకు కనిష్ట ధరల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడం, షార్ట్ కవరింగ్ సూచీలను 3నెలల గరిష్టానికి చేరుకునేందుకు సహకరించాయని ఆయనన్నారు.
ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 1836 పాయింట్లు, నిఫ్టీ 562 పాయింట్లు లాభపడింది. జీడీపీ గణాంకాలు 11ఏళ్ల కనిష్ట స్థాయిలో నమోదు కావడంతో పాటు భారత సార్వభౌమ రేటింగ్‌ను మూడీస్ బ్రోకరేజ్ డౌన్‌గ్రేడ్ చేసినప్పటికి సూచీలు ఈ స్థాయిలో ర్యాలీ చేయడం విశేషం.
టెక్నికల్ ఛార్ట్‌లను పరిశీలిస్తే... రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ షేర్లు బలహీనంగా ఉన్నాయి. అటో రంగంలో ముఖ్యంగా టూ-వీలర్స్, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు బలంగా ఉన్నాయని మెహతా తెలిపారు. అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధింపు సడలింపు, దేశీయ విమాన ట్రాఫిక్ నెమ్మదిగా పెరగడం, కంపెనీ బుక్‌లపై రియాలిటీ ప్రభావం మార్కెట్లకు కీలకం కానున్నాయి. అయితే గ్రౌండ్ రియాలిటీ పరిస్థితులు, ఇన్వెసర్ల సెంటిమెంట్ ఈ రెండు ఎంతవరకు కలిసిపోతాయో చూడాల్సి ఉందని మెహతా అంటున్నారు.
‘‘ ఏదైనా సంక్షోభ సమయంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. లాక్‌డౌన్ విధింపు మొత్తం ఆర్థిక వ్యవస్థను నిలిపివేసింది. ఈ పరిస్థితి బ్యాంకులు, ఫైనాన్స్ రంగ షేర్లలో అధిక ఒత్తిడిని కలిగించింది. ఈ ఒత్తిడి మరికొద్ది కాలం కొనసాగే అవకాశం ఉంది. మారిటోరియం సమయంలో వడ్డీ వసూలపై సుప్రీం కోర్టు నిర్ణయం జూన్ 12న వెలువడతుంది. అప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీపై ఒత్తిడికి లోనవుతుంది.’’ అని మెహతా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment