
ముంబై: స్టాక్ మార్కెట్ జెట్ స్పీడ్ లాభాలతో దూసుకుపోతుంది. సోమవారం ఉదయం మార్కెట్ ప్రారంభమైంది మొదలు ఇటు సెన్సెక్స్, అటు నిఫ్టీ సూచీలు పైపైకి దూసుకుపోయాయి. జులైకి సంబంధించి లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూలైనట్టు కేంద్రం ప్రకటన చేయడంతో ఒక్క సారిగా మార్కెట్‌కి జోష్ వచ్చింది. ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకుంటుందనే నమ్మకం కలగడంతో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారు.
బీఎస్‌ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 52,901 పాయింట్ల వద్ద మొదలైంది. ఆ వెంటనే పైపైకి చేరుకోవడం మొదలైంది. మొదటి గంటలోపే ఏకంగా 300లకు పైగా పాయింట్లు లాభపడింది. ఉదయం 9:45 గంటల సమయానికి 321 పాయింట్ల లాభంతో 52,908 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీలోనూ ఇదే జోరు కొనసాగుతోంది. ఉదయం 9:45 గంటల సమయానికి 98 పాయింట్లు లాభపడి 15,861 పాయింట్లు వద్ద ట్రేడవుతోంది. ఇదే జోరు సాయంత్రం వరకు కొనసాగితే సెన్సెక్స్ 53 వేలు క్రాస్ చేసే అవకాశం ఉంది.