తెలుగు రాష్ట్రాల్లో ఫాక్స్‌కాన్ యూనిట్లు | Foxconn convinced, plant in Hyderabad soon | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో ఫాక్స్‌కాన్ యూనిట్లు

Published Fri, Jul 10 2015 11:41 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

తెలుగు రాష్ట్రాల్లో ఫాక్స్‌కాన్ యూనిట్లు - Sakshi

తెలుగు రాష్ట్రాల్లో ఫాక్స్‌కాన్ యూనిట్లు

- హైదరాబాద్‌లో డేటా సెంటర్, ఏపీలో తయారీ యూనిట్
- ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు
- వెల్లడించిన కంపెనీ చీఫ్ టెర్రీ
న్యూఢిల్లీ:
ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ను, ఇంక్యూబేటర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో వీటిని ఏర్పాటు చేస్తామని ఈ గ్రూప్ హెడ్ టెర్రీ గౌ చెప్పారు. ఫాక్స్‌కాన్ కంపెనీ యాపిల్ కోసం ఐఫోన్‌లను, ఐప్యాడ్‌లను, అమెజాన్ కోసం కిండిల్ ట్యాబ్‌లను, ఇతర కంపెనీలకు ట్యాబ్‌లను, తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ చేస్తోంది. 2020 కల్లా భారత్‌లో 10-12 తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, కనీసం పది లక్షల ఉద్యోగాలను ఇవ్వనున్నామని భారత్‌లో స్వల్పకాల పర్యటన సందర్భంగా ఆయన వెల్లడించారు.

ముందుగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల్లో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. యాపిల్, సిస్కో, డెల్, మైక్రోసాఫ్ట్, హ్యులెట్-ప్యాకార్డ్  తదితర కంపెనీలకు తైవాన్‌కు చెందిన ఈ సంస్థ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్‌గా వ్యవహరిస్తోంది. భారత్‌లో మొబైల్సే కాకుండా ట్యాబ్‌లు, టీవీలు, బ్యాటరీలు, రూటర్లు తదితర వస్తువులను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement