ఫండ్స్‌లో 2 నెలల్లో రూ. లక్ష కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు ఏప్రిల్-మే నెలల్లో రూ.1.12 లక్షల కోట్లు మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేశారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలల్లో రూ.1.46 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(ఆంఫి) ఈ వివరాలను వెల్లడించింది. మార్కెట్లు ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌కే ఫండ్ మేనేజర్లు ప్రాధాన్యత ఇస్తున్నారని క్వాంటమ్ ఏఎంసీ అసోసియేట్ ఫండ్ మేనేజర్ నీలేష్ శెట్టి చెప్పారు. స్టాక్ మార్కెట్ మరింతగా తగ్గినప్పటికీ, ఇన్వెస్టర్లు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకోకపోవచ్చని పేర్కొన్నారు.