రాన్సమ్ వేర్ తర్వాత టార్గెట్ అవే..బీ అలర్ట్!
అయితే తర్వాతి టార్గెట్ అరచేతిలో ప్రపంచాన్ని నిలుపుతున్న స్మార్ట్ ఫోన్లేనని సంజయ్ హెచ్చరించారు. గత శుక్రవారం విజృంభించిన ఈ వన్నాక్రై అటాక్ తో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెండు లక్షలకు పైగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తో పనిచేసే డెస్క్ టాప్స్, ల్యాప్ టాప్స్ స్తంభించాయి. పీసీల డేటా అంతా తమ గుప్పిట్లోకి తీసుకుని ఈ అటాకర్లు నానా హంగామా చేశారు. మరోసారి విజృంభించబోయే వన్నాక్రై అటాక్ స్మార్ట్ ఫోన్లకేనని తెలియడంతో తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్నాయి.
బ్యాంకులకు, పవర్ యుటిలిటీస్ కు, రైల్వేస్, ఇతర కీలక ఇన్ ఫ్రాక్ట్ర్చర్ ప్రొవేడర్లకు వారమంతా అలర్ట్ లు పంపుతూనే ఉన్నామని, తర్వాత అటాక్ కు ముందస్తుగా ప్రైవేట్ వ్యక్తులతో డైరెక్ట్ గా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. వన్నాక్రై అటాక్ పై అధ్యయనం చేయడానికి ఏజెన్సీ ఓ టీమ్ కూడా నియమించింది. హ్యాకర్లు తర్వాతి టార్గెట్ స్మార్ట్ ఫోన్లే నిజమైతే, ప్రపంచానికి తీవ్ర ముప్పే వాటిల్లనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లుంటున్నాయి. డిజిటల్ కార్యకలాపాలు భారీగా విస్తరిస్తున్నప్పటి నుంచి స్మార్ట్ ఫోన్ వాడని వారే కనిపించడం లేదు.