మాలే ఎయిర్ పోర్టు కేసులో జీఎంఆర్ కి అనుకూలంగా తీర్పు | GMR Infra soars 15% on favourable ruling in Axis Bank debt case | Sakshi
Sakshi News home page

మాలే ఎయిర్ పోర్టు కేసులో జీఎంఆర్ కి అనుకూలంగా తీర్పు

Published Thu, Feb 25 2016 1:04 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

మాలే ఎయిర్ పోర్టు కేసులో జీఎంఆర్ కి అనుకూలంగా తీర్పు

మాలే ఎయిర్ పోర్టు కేసులో జీఎంఆర్ కి అనుకూలంగా తీర్పు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మాలే ఎయిర్‌పోర్టుకు సంబంధించి ఇండోనేషియా ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్ట పరిహరం ఈ ఏడాది మూడో త్రైమాసికంలోగా వస్తుందని జీఎంఆర్ ఇన్‌ఫ్రా తెలిపింది. జీఎంఆర్ - యాక్సిస్ బ్యాంక్ కేసులో సింగపూర్‌లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తీర్పు తమకు అనుకూలంగా ఇచ్చినట్లు జీఎంఆర్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. 2010లో మాలే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసే కాంట్రాక్టును 2012లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం రద్దు చేయడాన్ని జీఎంఆర్ కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఒప్పందాన్ని అర్థాంతరంగా రద్దు చేసినందుకు నష్టపరిహారానికి కోర్టును ఆశ్రయించగా వివాదం చివరకు ఆర్బిట్రేషన్‌కు చేరింది. ఫిబ్రవరి 23న సింగపూర్‌లోని ఆర్బిట్రేషన్ కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చినట్లు జీఎంఆర్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ వార్తల నేపథ్యంలో ఒకానొక దశలో 15 శాతం పెరిగిన షేరు చివరకు నాలుగు శాతం లాభంతో రూ. 11.65 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement