30 వేల దిశగా పసిడి పరుగు...
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితితో మదుపుదారులు బంగారం కొనుగోలుకు మొగ్గు చూపడంతో పసిడి తళుకులీనుతోంది. ఎంసీఎక్స్‌లో శుక్రవారం పదిగ్రాముల బంగారం రూ 250 రూ 29,400కు చేరింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో స్టాకిస్ట్‌ల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో కూడా బంగారం భారమవుతున్నదని ట్రేడర్లు చెబుతున్నారు. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్తతలు, డాలర్ బలహీనపడుతుండటంతో మరికొన్ని రోజులు గోల్డ్ జోష్ కొనసాగుతుందని భావిస్తున్నారు. మరోవైపు బంగారంలో దీర్ఘకాల పెట్టుబడులకు మాత్రం కొంతకాలం వేచిచూడాలని విశ్లేషకులు పేరదద్కొంటున్నారు. మరోవైపు