ఆరునెలల గరిష్ట స్థాయికి చేరిన పసిడి | Gold rises to six-month high on China worries, Ukraine crisis | Sakshi
Sakshi News home page

ఆరునెలల గరిష్ట స్థాయికి చేరిన పసిడి

Published Fri, Mar 14 2014 4:51 PM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM

ఆరునెలల గరిష్ట స్థాయికి చేరిన పసిడి

ఆరునెలల గరిష్ట స్థాయికి చేరిన పసిడి

ముంబయి : బంగారం ధర ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరింది. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం చల్లబడకపోవడం, చైనా ఆర్థిక వ్యవస్థలో మందగమనం వస్తుందనే వార్తల నేపథ్యంలో బంగారం ధర పెరగడానికి కారణమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర 1370 డాలర్లకు చేరింది. వారం కిందటితో పోలిస్తే ఔన్స్‌ ధర 20 డాలర్లకు పైగా పెరిగింది. నెల రోజుల కాలాన్ని తీసుకుంటే 50 డాలర్ల దాకా పెరిగింది.

గత ఆరు వారాలుగా పసిడి ధర పెరుగుతూ వస్తోంది. ఎంసీక్స్లో 10 గ్రాముల ధర 30,500ల రూపాయలు అధిగమించింది. ఎంసీక్స్ కంటే హైదరాబాద్‌ ధర కొంత తక్కువగా ఉంది. హైదరాబాద్లో ధర 30,260లుగా ఉందని ఇండియన్‌గోల్డ్‌రేట్‌ డాట్‌ కామ్‌ అనే వెబ్‌సైట్‌ చెబుతోంది. ఆర్నమెంట్‌ గోల్డ్‌ ధర  28,340 రూపాయలుగా ఉంది. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తత కొనసాగితే బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ధర అధికంగా ఉన్నందున ఫిజికల్‌ గోల్డ్‌ డిమాండ్‌ తగ్గుతోందని వర్తకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా బంగారం కొంటున్న చైనాలో కూడా డిమండ్‌ తగ్గుతోందని వార్తలు వస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement