appకీ కహానీ...
గూగుల్ డుయో...
ఒక చక్కటి వీడియో కాలింగ్ యాప్ కోసం వెతుకుతున్నారా? అయితే ఇంకేం టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘గూగుల్’ ఇటీవల మార్కెట్‌లోకి తెచ్చిన ‘డుయో’ యాప్‌ను ఉపయోగించి చూడండి. ఈ వీడియో కాలింగ్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రత్యేకతలు...
సింపుల్, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్. యాప్‌లోని లైవ్ ప్రివ్యూ ఫీచర్ ‘నాక్ నాక్’తో మనకు కాల్ చేస్తున్న వ్యక్తిని మనం కాల్ లిఫ్ట్ చేయకముందే చూడొచ్చు. అంటే అత ను ఎక్కడున్నాడో గమనించొచ్చు. యాప్ ద్వారా వేగవంతమైన, నాణ్యమైన వీడియో కాలింగ్ మాట్లాడొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో నిమిత్తం లేకుండా దేని నుంచి దేనికైనా వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. వీడియో కాలింగ్‌కు మీరు ఉపయోగిస్తున్న సిమ్ సంబంధిత ఆయా టెలికం ఆపరేటర్ల డేటా చార్జీలు వర్తిస్తాయి.