న్యూఢిల్లీ: త్వరలో పాన్ నెంబర్ కంపెనీలకు ప్రత్యేక గుర్తింపుగా మారనుంది. దేశంలో వ్యాపారానుకూల పరిస్థితుల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం.. పాన్ నెంబర్‌ను కంపెనీలకు కూడా విశిష్ట గుర్తింపు సంఖ్యగా మార్చాలని కసరత్తు చేస్తోంది. ఎలాంటి వ్యాపారం నిర్వహించే కంపెనీకైనా పాన్‌ను ప్రత్యేక గుర్తింపుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని క్యాబినెట్ కార్యదర్శి పి.కె.సిన్హా తెలిపారు. ఆయన ఇక్కడ సీఐఐ అధ్యక్షతన జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లోని పరిస్థితుల కారణంగా వ్యాపారానుకూల పరిస్థితుల జాబితాలో మన ర్యాంకు 142 నుంచి 130 స్థానానికి మెరుగుపడిందని చెప్పారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అవరోధాలను ఒకదాని తర్వాత మరొకదాన్ని పరిష్కరించుకుంటూ వెళ్తామని తెలిపారు. ఇన్‌ఫ్రా, రవాణా తదితర రంగాల్లో పలు సంస్కరణలను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు.