నాల్కో వాటా విక్రయం
ఇష్యూ ధర రూ.67
నేడు నాన్ రిటైలర్లకు.. రేపు రిటైల్ ఇన్వెస్టర్లకు
ముంబై: డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ అల్యూమినియం కంపెనీ(నాల్కో)లో 10 శాతం వరకూ వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) విధానంలో విక్రయించనుంది. నేడు నాన్–రిటైల్ ఇన్వెస్టర్లకు, రేపు(ఈ నెల 20న) రిటైల్ ఇన్వెస్టర్లకు వాటా విక్రయిస్తామని పేర్కొంది. ఈ వాటా విక్రయానికి ఇష్యూధరగా రూ.67గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది(బీఎస్‌ఈలో మంగళవారం ఈ షేర్ రూ.73 వద్ద ముగిసింది). ఈ ఓఎఫ్‌ఎస్ ద్వారా రూ.1,350 కోట్లు వస్తాయని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేపడుతున్న తొలి ప్రభుత్వ వాటా విక్రయం ఇది. నాల్కోలో ప్రభుత్వానికి 74.58 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం వార్త మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడింది.