Nalco
-
నాల్కో లాభం క్షీణత.. క్యూ3లో రూ. 256 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ(నాల్కో) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 69 శాతం క్షీణించి రూ. 256 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 831 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 3,845 కోట్ల నుంచి రూ. 3,356 కోట్లకు వెనకడుగు వేసింది. అల్యూమినా అమ్మకాలు తగ్గడం, అధిక ముడివ్యయాలు, ప్రపంచ అనిశ్చితులు లాభదాయకతను దెబ్బతీసినట్లు కంపెనీ పేర్కొంది. అయితే అల్యూమినియం ధరలు బలపడటం, ఉత్పత్తి పుంజుకోవడం కారణంగా రానున్న త్రైమాసికాలలో ఉత్తమ ఫలితాలను సాధించనున్నట్లు కంపెనీ సీఎండీ శ్రీధర్ పాత్ర అంచనా వేశారు. -
సరికొత్త రికార్డు.. కంపెనీ ప్రారంభమయ్యాక ఇదే ఫస్ట్‌టైం!
భువనేశ్వర్: ప్రభుత్వ రంగ మెటల్ కంపెనీ నేషనల్ అల్యూమినియం(నాల్కో) గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో రికార్డ్ లాభాలు ఆర్జించింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 2,952 కోట్ల లాభం ప్రకటించింది. ఈ కాలంలో మొత్తం అమ్మకాలు సైతం కొత్త గరిష్టాన్ని సాధిస్తూ రూ. 14,181 కోట్లకు చేరాయి. ఈ బాటలో కంపెనీ అల్యూమినియం క్యాస్ట్ మెటల్ ఉత్పత్తి 4,60,000 టన్నులను తాకింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. కంపెనీ ప్రారంభమయ్యాక తొలిసారి 100 శాతం ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగించుకుంది. నాల్కో ప్రస్థానంలో గతేడాది చరిత్రాత్మకమని వార్షిక వాటాదారుల సమావేశంలో కంపెనీ సీఎండీ శ్రీధర్ పాత్ర పేర్కొన్నారు. అత్యుత్తమ ఫలితాలు కంపెనీ పటిష్ట పనితీరుకు దృష్టాంతమని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి సవాళ్లలోనూ ఉద్యోగులంతా కీలకపాత్ర పోషించినట్లు ప్రశంసించారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ముడివ్యయాలు, బొగ్గు సంక్షోభం, ఎల్ఎంఈ ధరల్లో అనిశ్చితి తదితరాల మధ్య కూడా ప్రపంచంలోనే బాక్సైట్, అల్యూమినా చౌక తయారీదారుగా కంపెనీ నిలిచినట్లు ప్రస్తావించారు. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
Nalco: రెండేళ్లలో పూర్తి
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో), మిశ్ర ధాతు నిగమ్ (మిధానీ)లు సంయుక్తంగా రాష్ట్రంలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రెండేళ్లలోగా పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ పరిశ్రమకు మౌలిక సదుపాయాల కల్పనలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాల్కో, మిధానీల సంయుక్త సంస్థ ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ అత్యాధునిక అల్యూమినియం అల్లాయ్ ఉత్పత్తుల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. రూ.5,500 కోట్ల భారీ పెట్టుబడితో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో ఇది ఏర్పాటవుతోంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం 60 వేల మెట్రిక్ టన్నులు. దీని ద్వారా దాదాపు 1000 మందికి ఉపాధి లభిస్తుంది. నాల్కో సీఎండీ శ్రీధర్ పాత్ర, మిధానీ సీఎండీ సంజయ్ కుమార్ ఝా సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ప్రాజెక్టు గురించి సమగ్రంగా వివరించారు. ప్రాజెక్టు మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. సదుపాయాల కల్పనలో ఎదురవుతున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన సీఎం.. మౌలిక సదుపాయాలపై తగిన చర్యలు తీసుకోవాలని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రక్షణ అనుబంధ రంగాల పరికరాల తయారీదారుల అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా ఎంఎస్ఎంఈ పార్క్‌ను కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచించగా అందుకు సీఎండీలు అంగీకరించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జేవీఎన్ సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన గుమ్మళ్ళ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన నాల్కో, మిథానీ సీఎండీలు
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని నాల్కో సీఎండీ శ్రీధర్ పాత్ర, మిథానీ సీఎండీ సంజయ్ కుమార్ ఝా కలిశారు. నాల్కో, మిథానీ సంయుక్త సంస్ధ ఉత్కర్ష అల్యుమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ (యూడీఏఎన్‌ఎల్) ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో హై ఎండ్ అల్యుమినియం అల్లాయ్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. రూ.5,500 కోట్లతో ఏర్పాటు కానున్న పరిశ్రమ, ఏడాదికి 60,000 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ కెపాసిటీ, రెండు నుంచి రెండున్నరేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి కానుంది. చదవండి: సీపీఎస్ రద్దుపై ఏపీ ప్రభుత్వం కొత్త కమిటీ దాదాపు 750-1000 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ప్రాజెక్ట్ ఏర్పాటుకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనపై ఎదురవుతున్న సమస్యలను సీఎం దృష్టికి అధికారులు తీసుకురాగా, వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను సీఎం ఆదేశించారు. రక్షణ అనుబంధ రంగాలకు సంబంధించిన పరికరాల తయారీదారుల అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్ట్‌కు అనుబంధంగా ఎంఎస్ఎంఈ పార్క్‌ను కూడా ఏర్పాటుచేయాలని సీఎం సూచించగా, సీఎండీలు అంగీకరించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జేవీఎన్.సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన గుమ్మళ్ళ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. -
బ్లూచిప్ పీఎస్‌యూల్లో ఆఫర్ ఫర్ సేల్!
న్యూఢిల్లీ: నాల్కో, కోల్ ఇండియా, ఎన్టీపీసీ వంటి బ్లూచిప్ పీఎస్‌యూల్లో ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో షేర్లను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.1.05 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ లక్ష్య సాధన కష్టతరం కానుండటంతో నాల్కో, కోల్ ఇండియా వంటి మంచి పనితీరు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఓఎఫ్ఎస్ను చేపట్టాలని డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం భావిస్తోంది. నేషనల్ అల్యూమినియమ్ కంపెనీ(నాల్కో), కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఎన్ఎమ్డీసీ, ఎన్బీసీసీ(ఇండియా), భారత్ ఎలక్ట్రానిక్స్, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, హిందుస్తాన్ కాపర్.. ఈ కంపెనీలు ఓఎఫ్ఎస్ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీల్లో ప్రభుత్వానికి 52–82 శాతం రేంజ్లో వాటాలున్నాయి. అయితే ఈ కంపెనీల ఓఎఫ్‌ఎస్‌కు ప్రధాన మంత్రి కార్యాలయం ఆమోదం పొందాల్సి ఉంది. మరోవైపు మార్కెట్ స్థితిగతులు బాగా ఉంటేనే ఈ షేర్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి దండిగా రాబడి రాగలదు. బీపీసీఎల్, ఎయిర్ ఇండియాల వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తికాకవపోచ్చు. ఫలితంగా డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యసాధనలో రూ.87,000 కోట్ల మేర కోత పడనున్నది. -
నాల్కో లాభం 129 శాతం వృద్ధి
అల్యూమినియమ్ దిగ్గజం, ప్రభుత్వ రంగ నేషనల్ అల్యూమినియమ్ కంపెనీ (నాల్కో) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.510 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.235 కోట్లతో పోలిస్తే 129 శాతం వృద్ధి సాధించామని నాల్కో తెలిపింది. నిర్వహణ లాభం రూ.223 కోట్ల నుంచి 229 శాతం వృద్ధితో రూ.725 కోట్లకు చేరుకుంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం రెండు క్వార్టర్లను పరిగణనలోకి తీసుకుంటే టర్నోవర్ 42 శాతం వృద్ధితో రూ.5,952 కోట్లకు, నికర లాభం 229 శాతం వృద్ధితో రూ.1,197 కోట్లకు పెరిగాయని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం తొలి రెండు క్వార్టర్లలో రూ.334 కోట్లుగా ఉన్న నిర్వహణ లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండు క్వార్టర్లలో నాలుగు రెట్లు పెరిగి రూ.1,624 కోట్లకు చేరింది. ఎబిటా మార్జిన్ 17 శాతం నుంచి రెట్టింపై 34 శాతానికి పెరిగిందని పేర్కొంది. ‘‘అమెరికా వాణిజ్య ఆంక్షల కారణంగా అల్యూమినా, అల్యూమినియమ్ ధరల్లో తీవ్రమైన ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ, పనితీరు చెప్పుకోదగిన స్థాయిలో మెరుగుపడింది. ఏడాది క్రితం మేం ఆరంభించిన కొత్త వ్యాపార విధానమే దీనికి కారణం. ఈ విధానంలో భాగంగా వ్యయాల నియంత్రణ, ఉత్పత్తి పెంపు, స్పాట్ మార్కెట్లలో వ్యూహాత్మక మార్కెటింగ్ వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాం’’ అని నాల్కో వివరించింది. మార్కెట్ ముగిసిన తర్వాత నాల్కో ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో నాల్కో షేర్ 1.2 శాతం క్షీణించి రూ.69.45 వద్ద ముగిసింది. -
నాల్కో లాభం రెట్టింపు
భువనేశ్వర్: అల్యూమినియమ్ దిగ్గజ కంపెనీ నాల్కో (నేషనల్ అల్యూమినియమ్ కంపెనీ) నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపైంది. 2016–17లో రూ.669 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,342 కోట్లకు పెరిగిందని నాల్కో తెలిపింది. గత పదేళ్లలో చూస్తే, ఇదే అత్యధిక లాభమని నాల్కో సీఎమ్‌డీ తపన్ కుమార్ చంద్ చెప్పారు. కొత్త వ్యాపార ప్రణాళిక కారణంగా తమ కంపెనీ కొత్త వృద్ధి పథంలోకి దూసుకుపోయిందని పేర్కొన్నారు. తమ కంపెనీ ఉద్యోగుల టీమ్ వర్క్, వ్యయ నియంత్రణ పద్ధతులపై దృష్టి పెట్టడం, వ్యూహాత్మక ప్లానింగ్...ఈ అంశాలు కూడా తమ విజయానికి కారణాలని వివరించారు. మంగళవారం జరిగిన ఈ నవరత్న కంపెనీ 37వ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. టర్నోవర్, ఎగుమతుల్లో కూడా రికార్డ్‌లు నికర లాభమే కాకుండా, టర్నోవర్ కూడా గత ఆర్థిక సంవత్సరంలో 26 శాతం వృద్ధితో రూ.9,376 కోట్లకు పెరిగిందని చంద్ పేర్కొన్నారు. ఎగుమతుల ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.4,076 కోట్లకు ఎగసిందని, కంపెనీ చరిత్రలో ఇదే అత్యధికమని వివరించారు. నికర విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిన మూడో అతి పెద్ద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ తమదేనని చెప్పారు. ఒక్కో షేర్‌కు రూ.5.70 డివిడెండ్.. రూ.5 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.5.70 డివిడెండ్‌ను చెల్లించడానికి ఏజీఎమ్ ఆమోదం తెలిపిందని తపన్ కుమార్ చంద్ తెలిపారు. కంపెనీ ప్రారంభమైన 1981 నుంచి చూస్తే, ఇదే అత్యధిక డివిడెండ్ అని వివరించారు. మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.1,102 కోట్లుగా ఉంటాయని పేర్కొన్నారు. -
స్టాక్స్ వ్యూ
నాల్కో బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ. 69 టార్గెట్ ధర: రూ.108 ఎందుకంటే: నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మంచి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఎబిటా 344 శాతం(సీక్వెన్షియల్‌గా చూస్తే 61 శాతం) వృద్ధితో రూ.1,010 కోట్లకు ఎగిసింది. అల్యూమినా ధరలు బాగా పెరగడం వల్ల ఈ కంపెనీ ఈ స్థాయి ఎబిటా సాధించింది. నికర లాభం 5 రెట్లు (సీక్వెన్షియల్‌గా 70 శాతం) పెరిగి రూ.630 కోట్లకు చేరింది. అల్యుమినా ఉత్పత్తి 11 శాతం వృద్ధితో 583 కిలో టన్నులకు పెరిగింది. ఒక క్వార్టర్లో ఇంత అత్యధిక స్థాయి ఉత్పత్తి సాధించడం ఈ కంపెనీకి ఇదే మొదటిసారి. అమ్మకాలు 24 శాతం తగ్గినా, రియలైజేషన్ 36 శాతం (సీక్వెన్షియల్‌గా) పెరిగి 562 డాలర్లకు (టన్నుకు) పెరిగింది. అల్యూమినియం ఉత్పత్తి 9 శాతం, అమ్మకాలు 18 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ప్రపంచంలో అతి పెద్ద అల్యూమినా కంపెనీల్లో ఒకటైన నార్వేకు చెందిన నార్స్క్ హైడ్రో కొన్ని అల్యూమినా ప్లాంట్లను మూసేయడం, చైనా రిఫైనరీలు ఉత్పత్తిని నిలిపేయడం వల్ల అల్యూమినా ధరలు పెరుగుతున్నాయి. ఇది నాల్కో కంపెనీకి లాభిస్తోంది. నాల్కోకు విస్తారమైన బాక్సైట్ గనులు ఉండటం సానుకూలాంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎబిటా 71 శాతం ఎగసి రూ.2,840 కోట్లకు, నికర లాభం 12 శాతం పెరిగి రూ.1,760 కోట్లకు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. 2012–13లో 5 శాతంగా ఉన్న రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతానికి పెరగగలదని భావిస్తున్నాం. ఆయిల్ ఇండియా బ్రోకరేజ్ సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ. 204 టార్గెట్ ధర: రూ.314 ఎందుకంటే: ఆయిల్ ఇండియా కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 45 శాతం వృద్ధితో రూ.3,390 కోట్లకు పెరిగింది. చమురు, గ్యాస్ రియలైజేషన్లు అధికంగా ఉండటమే దీనికి కారణం. ఒక్కో బ్యారెల్‌కు ఆయిల్ రియలైజేషన్ 55 శాతం వృద్ధితో రూ.4,823కు పెరిగింది. అలాగే గ్యాస్ రియలైజేషన్ 17 శాతం ఎగసింది. ముడిచమురు అమ్మకాలు 0.6 శాతం తగ్గినా, ఎబిటా 61 శాతం వృద్ధితో రూ.1,408 కోట్లకు చేరింది. గత క్యూ1లో 29 శాతంగా ఉన్న పన్ను రేటు ఈ క్యూ1లో 35 శాతానికి పెరిగినప్పటికీ, నికర లాభం 56 శాతం వృద్ధితో రూ.703 కోట్లకు పెరిగింది. ఈ క్యూ1లో ఎలాంటి సబ్సిడీ భారం లేదు. బ్యారెల్ ముడిచమురు 80 డాలర్ల లోపు ఉన్నంత వరకూ ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు, ఆప్‌స్ట్రీమ్ కంపెనీలపై ఎలాంటి భారం ఉండదు. అయితే వంట గ్యాస్ విషయమై కొంత సబ్సిడీ భారం ఆప్‌స్ట్రీమ్ కంపెనీలపై ఉంటుంది. ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, ఈ షేర్ ఈ ఏడాది జనవరిలో పైపైకి ఎగసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ, ఈ షేర్ 17 శాతం వరకూ తగ్గింది. ప్రస్తుత ధర కొనుగోళ్లకు ఆకర్షణీయమని భావిస్తున్నాం. డివిడెండ్ ఈల్డ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.7 శాతంగా ఉండొచ్చని అంచనా. అలాగే రెండేళ్లలో ఈపీఎస్ 13 శాతం చొప్పున చక్రగతిన వృద్ది చెందగలదని భావిస్తున్నాం. సమ్ ఆఫ్ ద పార్ట్స్ ప్రాతిపదికన టార్గెట్ ధరను నిర్ణయించాం. చమురు ధరలు పెరిగితే సబ్సిడీ భారం పెరుగుతుంది. ఇది షేర్ ధరపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. -
విజయసాయి రెడ్డి ప్రశ్నలకు మంత్రుల జవాబులు
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు సోమవారం కేంద్ర మంత్రులు రాజ్యసభలో సమాధానమిచ్చారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలపై ఎంపీ ప్రశ్నకు గనుల శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్ధీబాయ్ చౌదరి వివరణనిచ్చారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వ రంగ సంస్థ నాల్కో ప్రతిపాదనలు సమర్పించినట్టు పేర్కొన్నారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్ కోసం కొన్ని బ్లాక్‌లను కేటాయించాల్సిందిగా నాల్కో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలను సమర్పించిందని చెప్పారు. బాక్సైట్ గనుల కేటాయింపు జరిగితే విశాఖపట్నంలో అల్యూమినా రిఫైనరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమని నాల్కో తన ప్రతిపాదనలలో పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. విశాఖ ఏజెన్సీలోని గూడెం, జెర్రలలోని బాక్సైట్ బ్లాక్‌లతోపాటు తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని కాటంరాజు కొండ వద్ద గల బాక్సైట్ బ్లాక్‌లను తవ్వకాల కోసం లీజుకు కేటాయించాల్సిందిగా 2007 నవంబర్లోనే నాల్కో దరఖాస్తు చేసిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులను ఆమోదిస్తూ ఆయా బాక్సైట్ బ్లాక్‌లలో తవ్వకాలు జరిపేందుకు 2009 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నాల్కోకు అనుమతించినట్లు మంత్రి తెలిపారు. కారణాంతరాల వలన నాల్కో బాక్సైట్ తవ్వకాలను చేపట్టలేకపోయిందని పేర్కొన్నారు. దీంతో తిరిగి ఏజెన్సీ ప్రాంతంలోని బాక్సైట్ బ్లాక్‌లలో మైనింగ్ లీజు కోసం నాల్కో 2017 మే, 2017 సెప్టెంబర్ మాసాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. సుప్రీం కోర్టు (సమతా తీర్పులో) ఆదేశాల ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రభుత్వ లేదా ప్రభుత్వ అధీనంలోని సంస్థ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించవచ్చు. నాల్కో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినందున షెడ్యూల్డు ఏరియాలో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి అర్హత కలిగి ఉందని ఆయన వెల్లడించారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులపై ఆంక్షలు లేవు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఆయిల్ రిఫైనరీ, పెద్ద ఎత్తున ఆయిల్ ట్యాంక్‌లు ఉన్నందున రక్షణ శాఖ విమానాల్లో పైలట్ల శిక్షణకు ఇది ఎంతవరకు సురక్షితం అన్న ప్రశ్నకు రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రే లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో కమర్షియల్ విమానాల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని వెల్లడించారు. విశాఖపట్నంలో ప్రాథమికమైన ఫ్లైయింగ్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబోమని తెలిపారు. సుశిక్షితులైన పైలట్లే ఈ ఎయిర్పోర్ట్ నుంచి మిలటరీ విమానాలను ఆపరేట్ చేస్తారని చెప్పారు. మిలటరీ విమానాల రాకపోకలకు సంబంధించి అవసరమైన అన్ని భద్రతా చర్యలు పాటిస్తున్నామని వెల్లడించారు. ఆయిల్ రిఫైనరీలు, ట్యాంక్‌లపై నుంచి మిలటరీ విమానాలు రాకపోకలు సాగించవని మంత్రి స్పష్టం చేశారు. -
నాల్కో వాటా విక్రయం
ఇష్యూ ధర రూ.67 నేడు నాన్ రిటైలర్లకు.. రేపు రిటైల్ ఇన్వెస్టర్లకు ముంబై: డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ అల్యూమినియం కంపెనీ(నాల్కో)లో 10 శాతం వరకూ వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనుంది. నేడు నాన్–రిటైల్ ఇన్వెస్టర్లకు, రేపు(ఈ నెల 20న) రిటైల్ ఇన్వెస్టర్లకు వాటా విక్రయిస్తామని పేర్కొంది. ఈ వాటా విక్రయానికి ఇష్యూధరగా రూ.67గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది(బీఎస్ఈలో మంగళవారం ఈ షేర్ రూ.73 వద్ద ముగిసింది). ఈ ఓఎఫ్ఎస్ ద్వారా రూ.1,350 కోట్లు వస్తాయని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేపడుతున్న తొలి ప్రభుత్వ వాటా విక్రయం ఇది. నాల్కోలో ప్రభుత్వానికి 74.58 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం వార్త మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడింది. -
30 నుంచి నాల్కో బైబ్యాక్ ఆఫర్...
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాల్కో షేర్ల బైబ్యాక్ ఈ నెల 30న ప్రారంభం కానుంది. సెస్టెంబర్ 14తో ముగుస్తుంది. ఇందులో భాగంగా రూ.2,835 కోట్ల విలువైన సుమారు 64.43 కోట్ల షేర్లను (22.15 శాతం వాటాకు సమానం) కొనుగోలు చేయనుంది. ఒక్కో షేరుకు రూ.44 చొప్పున చెల్లించనుండగా... ఇందుకుగాను రిజర్వ్ నిధులను వినియోగించనుంది. ఎస్బీఐ కేపిటల్ మార్కెట్స్‌కు బైబ్యాక్ కార్యక్రమ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ఆఫర్ లెటర్‌ను నాల్కో స్టాక్ ఎక్స్ఛేంజ్లకు అందజేసింది. మూలధనం తగ్గించడం ద్వారా దీర్ఘకాలంలో వాటాదారుల విలువ పెరుగనున్నట్టు కంపెనీ తెలిపింది. -
ప్రభుత్వం నుంచి 25% వాటా కొంటున్న నాల్కో
కేంద్రానికి రూ.3,250 కోట్లు సమకూరే అవకాశం! న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అల్యూమినియం కంపెనీ నాల్కో... కంపెనీకి చెందిన 25 శాతం వాటాను ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయనుంది. ఏ ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించడానికి నాల్కో కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ మరో 15 రోజుల్లో సమావేశం కానున్నదని గనుల కార్యదర్శి బల్విందర్ కుమార్ చెప్పారు. ప్రభుత్వం నుంచి 25 శాతం వాటాను కొనుగోలు చేసేలా నాల్కోకు మార్గదర్శకత్వం చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తమకు లేఖ రాసిందని పేర్కొన్నారు. ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.3,250 కోట్ల నిధులు వస్తాయని అంచనా. నాల్కోలో 10 శాతం వాటా విక్రయం ద్వారా రూ.1,300 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం గతంలో భావించింది. కానీ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులమయంగా ఉండటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. -
నాల్కో లాభం 34 శాతం డౌన్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని అల్యూమినియం తయారీ కంపెనీ. నాల్కో నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు 34 శాతం క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.342 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.226 కోట్లకు తగ్గిపోయిందని నేషనల్ అల్యూమినియం కంపెనీ(నాల్కో) తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,996 కోట్ల నుంచి 9 శాతం క్షీణించి రూ.1,815 కోట్లకు పడిపోయిందని ఈ నవరత్న సీపీఎస్‌యూ వెల్లడించింది. వ్యయాలు రూ.1,625 కోట్ల నుంచి రూ.1,583 కోట్లకు, నికర అమ్మకాలు రూ.1,249 కోట్ల నుంచి రూ.1,151 కోట్లకు తగ్గాయని తెలిపింది. నాల్కో షేర్ బీఎస్ఈలో బుధవారం 3% లాభంతో రూ.37.30 వద్ద ముగిసింది. -
నాల్కో సీఎండీగా టి.కె. చాంద్
విశాఖపట్నం : నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో) చైర్మన్ కమ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా (సీఎండీ) విశాఖ స్టీల్‌ప్లాంట్ డెరైక్టర్(కమర్షియల్) టి.కె.చాంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. ఒడిస్సాకు చెందిన చాంద్... 1983లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మేనేజ్మెంట్ ట్రైనీగా కెరీర్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ 2008లో డెప్యూటీ జనరల్ మేనేజర్ (పర్సనల్) స్థాయికి చేరారు. అదే సంవత్సరంలో విశాఖ ఉక్కు నుంచి కోల్ ఇండియా లిమిటెడ్‌కు డెరైక్టర్ (పర్సనల్)గా బదిలీ అయి వెళ్లారు.