నాల్కో లాభం 34 శాతం డౌన్ | NALCO Q2 Net Declines 34% to Rs. 226.14 Crore | Sakshi
Sakshi News home page

నాల్కో లాభం 34 శాతం డౌన్

Published Fri, Nov 13 2015 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 PM

నాల్కో లాభం 34 శాతం డౌన్

నాల్కో లాభం 34 శాతం డౌన్

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని అల్యూమినియం తయారీ కంపెనీ. నాల్కో నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు 34 శాతం క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.342 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.226 కోట్లకు తగ్గిపోయిందని నేషనల్ అల్యూమినియం కంపెనీ(నాల్కో) తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,996 కోట్ల నుంచి 9 శాతం క్షీణించి రూ.1,815 కోట్లకు పడిపోయిందని ఈ నవరత్న సీపీఎస్‌యూ వెల్లడించింది.

వ్యయాలు రూ.1,625 కోట్ల నుంచి రూ.1,583 కోట్లకు,  నికర అమ్మకాలు రూ.1,249 కోట్ల నుంచి రూ.1,151 కోట్లకు  తగ్గాయని తెలిపింది. నాల్కో షేర్ బీఎస్‌ఈలో బుధవారం 3% లాభంతో రూ.37.30 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement