నాల్కో లాభం 34 శాతం డౌన్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని అల్యూమినియం తయారీ కంపెనీ. నాల్కో నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు 34 శాతం క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.342 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.226 కోట్లకు తగ్గిపోయిందని నేషనల్ అల్యూమినియం కంపెనీ(నాల్కో) తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,996 కోట్ల నుంచి 9 శాతం క్షీణించి రూ.1,815 కోట్లకు పడిపోయిందని ఈ నవరత్న సీపీఎస్‌యూ వెల్లడించింది.
వ్యయాలు రూ.1,625 కోట్ల నుంచి రూ.1,583 కోట్లకు, నికర అమ్మకాలు రూ.1,249 కోట్ల నుంచి రూ.1,151 కోట్లకు తగ్గాయని తెలిపింది. నాల్కో షేర్ బీఎస్ఈలో బుధవారం 3% లాభంతో రూ.37.30 వద్ద ముగిసింది.