నాల్కో సీఎండీగా టి.కె. చాంద్ | TK Chand as Nalco Cmd | Sakshi
Sakshi News home page

నాల్కో సీఎండీగా టి.కె. చాంద్

Published Wed, Jul 22 2015 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

నాల్కో సీఎండీగా  టి.కె. చాంద్

నాల్కో సీఎండీగా టి.కె. చాంద్

విశాఖపట్నం : నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో) చైర్మన్ కమ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా (సీఎండీ) విశాఖ స్టీల్‌ప్లాంట్  డెరైక్టర్(కమర్షియల్) టి.కె.చాంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. ఒడిస్సాకు చెందిన చాంద్... 1983లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా కెరీర్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ 2008లో డెప్యూటీ జనరల్ మేనేజర్ (పర్సనల్) స్థాయికి చేరారు. అదే సంవత్సరంలో విశాఖ ఉక్కు నుంచి కోల్ ఇండియా లిమిటెడ్‌కు డెరైక్టర్ (పర్సనల్)గా బదిలీ అయి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement