National Aluminium Company
-
నాల్కో లాభం క్షీణత.. క్యూ3లో రూ. 256 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ(నాల్కో) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 69 శాతం క్షీణించి రూ. 256 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 831 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 3,845 కోట్ల నుంచి రూ. 3,356 కోట్లకు వెనకడుగు వేసింది. అల్యూమినా అమ్మకాలు తగ్గడం, అధిక ముడివ్యయాలు, ప్రపంచ అనిశ్చితులు లాభదాయకతను దెబ్బతీసినట్లు కంపెనీ పేర్కొంది. అయితే అల్యూమినియం ధరలు బలపడటం, ఉత్పత్తి పుంజుకోవడం కారణంగా రానున్న త్రైమాసికాలలో ఉత్తమ ఫలితాలను సాధించనున్నట్లు కంపెనీ సీఎండీ శ్రీధర్ పాత్ర అంచనా వేశారు. -
నాల్కో హైజంప్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం నేషనల్ అల్యూమినియం కంపెనీ(నాల్కో) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం మూడు రెట్లుపైగా ఎగసి రూ. 831 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 240 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,415 కోట్ల నుంచి రూ. 3,845 కోట్లకు జంప్ చేసింది. తాజాగా వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఇప్పటికే రూ. 2.50 డివిడెండును చెల్లించిన సంగతి తెలిసిందే. ఫలితాల నేపథ్యంలో నాల్కో షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 119 వద్ద ముగిసింది. -
నాల్కోకు ప్రతిష్టాత్మక ఎక్సలెన్స్ అవార్డు
భువనేశ్వర్: నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ- నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో)- ఐఐఐఈ ప్రతిష్టాత్మక ‘ఫెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డు 2014’కు ఎంపికయ్యింది. చక్కటి పనితీరు ప్రదర్శించిన కంపెనీలకు గుర్తింపుగా ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఈ అవార్డును నెలకొల్పింది. దుబాయ్‌లో అక్టోబర్ 8న జరిగే 19వ సీఈఓల సదస్సులో ఈ అవార్డు ప్రదానం జరుగుతుందని నాల్కో ఒక ప్రకటనలో తెలిపింది. -
నాల్కో సీఎండీగా టి.కె. చాంద్
విశాఖపట్నం : నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో) చైర్మన్ కమ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా (సీఎండీ) విశాఖ స్టీల్‌ప్లాంట్ డెరైక్టర్(కమర్షియల్) టి.కె.చాంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. ఒడిస్సాకు చెందిన చాంద్... 1983లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మేనేజ్మెంట్ ట్రైనీగా కెరీర్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ 2008లో డెప్యూటీ జనరల్ మేనేజర్ (పర్సనల్) స్థాయికి చేరారు. అదే సంవత్సరంలో విశాఖ ఉక్కు నుంచి కోల్ ఇండియా లిమిటెడ్‌కు డెరైక్టర్ (పర్సనల్)గా బదిలీ అయి వెళ్లారు.